'ఆప్‌-కాంగ్రెస్' పొత్తు లేన‌ట్లే..!

రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఉత్కంఠ నెలకొంది. మూడు ప్రధాన పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ లు క్రియాశీలకంగా మారాయి

By Kalasani Durgapraveen  Published on  17 Nov 2024 12:30 PM GMT
ఆప్‌-కాంగ్రెస్ పొత్తు లేన‌ట్లే..!

రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఉత్కంఠ నెలకొంది. మూడు ప్రధాన పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ లు క్రియాశీలకంగా మారాయి. ఫిరాయింపులు జోరందుకోవడంతో పాటు రాజకీయ కార్యకలాపాలు కూడా ఊపందుకున్నాయి. గత రెండు ఎన్నికల నుంచి ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి ఫామ్‌లో కనిపిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ న్యాయ యాత్ర చేపడుతూనే.. సంస్థాగత స్థాయిలో కూడా నిత్యం సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే లోక్‌సభ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్, కాంగ్రెస్ చేతులు కలిపే అవ‌కాశ ఉంద‌ని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

ఇలాంటి వాతావరణంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ తన ఇష్టాన్ని రాష్ట్ర శాఖపై బలవంతంగా రుద్దే నియంత కాదు. పంజాబ్, హర్యానాలలో కూడా పార్టీ రాష్ట్ర యూనిట్ కోరికలను హైకమాండ్ గౌరవించింది. ఢిల్లీలో కూడా అగ్రనేతలు, పార్టీ స్థానిక నేత‌ల‌ను సంప్రదించి.. ఆప్‌ను ప‌క్క‌కుపెట్టిన తర్వాతే న్యాయ యాత్రను చేపడుతున్నామ‌న్నారు.

2013లో ఏర్పడిన పరిస్థితి నేటికి కూడా అలాగే ఉంది. ఎన్నో పనులు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రజలు అధికారం నుంచి గద్దె దించారు. అయితే ఆప్‌ ప్రభుత్వం సాధించిన విజయాలు లెక్కలేమీ లేవు. ఢిల్లీ దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయింది. ఫ్రీ-ఫ్రీ కారణంగా ఢిల్లీ అభివృద్ధి ఆగిపోయింది. ఎక్కడ చూసినా ప్రజల బాధలు, సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ఈసారి మళ్లీ ప్రభుత్వం మారి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉందన్నారు. కాంగ్రెస్‌కు అభ్య‌ర్ధులు లేర‌నే వాద‌న‌పై స్పందిస్తూ.. అభ్యర్థుల విషయానికి వస్తే ఒక్కో సీటుకు 10 నుంచి 12 మంది అభ్యర్థులు వరుసలో ఉన్నారు. వారిలో మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తామ‌న్నారు.

Next Story