రైతులకు మద్దతుగా సీఎం ఉపవాస దీక్ష

Delhi CM Arvind Kejriwal to fast in support of farmers today. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ వ్య‌వ‌సాయ బిల్లుల‌కు

By Medi Samrat  Published on  14 Dec 2020 9:43 AM IST
రైతులకు మద్దతుగా సీఎం ఉపవాస దీక్ష

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ వ్య‌వ‌సాయ బిల్లుల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌నలు చేప‌ట్టిన‌ రైతులకు మద్దతుగా‌ ఒక్కరోజు ఉపవాస దీక్ష చేపట్టారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా తాను ఇవాళ ఉపవాసం ఉంటున్నట్లు ప్రకటించారు. తనతోపాటు ఆమ్‌ ఆద్మీపార్టీ కార్యకర్తలు కూడా రైతులకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.



రైతులకు మద్దతుగా ఉపవాసం ఉండాలని పార్టీ కార్యకర్తలు, దేశప్రజలను కోరుతున్నాను. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతుల వద్దకు చేరుకోవడం మనలో చాలామందికి సాధ్యం కాదు. అందువల్ల తమ ఇళ్ల నుంచే రైతులకు మద్దతు తెలపాలని అన్నారు. ఇదిలావుంటే.. కేంద్ర ప్రభుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న ఆందోళనలు 19వ రోజుకు చేరాయి.

సాగు చట్టాల రద్దు ఏకైక డిమాండ్‌గా రైతు సంఘాల నేతలు నేడు ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఢిల్లీ సరిహద్దుల్లోని నిరసన ప్రాంతాలైన సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌లలో దీక్షకు దిగారు. దీక్షల నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దులకు భారీగా రైతులు చేరుకుంటున్నారు. ఈ సాయంత్రం 5 గంటల వరకు దీక్ష‌ కొనసాగనుంది.


Next Story