యూపీ ఎన్నికలు వాయిదా వేయండి : అలహాబాద్ హైకోర్టు
Delay UP Elections, Ban Rallies. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఒక నెల లేదా రెండు నెలలు వాయిదా
By Medi Samrat Published on 24 Dec 2021 9:40 AM IST
త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఒక నెల లేదా రెండు నెలలు వాయిదా వేయాలని అలహాబాద్ హైకోర్టు ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించింది. రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన ర్యాలీలు, సమావేశాలను నిషేధించాలని.. ఓమిక్రాన్ భయంతో రాష్ట్ర ఎన్నికలను వాయిదా వేయడం గురించి ఆలోచించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. అన్‌కనెక్ట్డ్ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. "ర్యాలీలను ఆపకపోతే, ఫలితాలు రెండవ వేవ్ కంటే దారుణంగా ఉంటాయి" అని జస్టిస్ శేఖర్ యాదవ్ అన్నారు, "జాన్ హై తో జహాన్ హై (జీవితం ఉంటే, మనకు ప్రపంచం ఉంది)" అని అన్నారు.
దేశ, విదేశాల్లో ఓమిక్రాన్‌పై పెరుగుతున్న భయాందోళనల దృష్ట్యా, ఎన్నికల సభలు, ర్యాలీల్లో జనం గుమిగూడడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇన్ఫెక్షన్ మరియు థర్డ్ వేవ్ నుండి ప్రజలను రక్షించడానికి, ఎన్నికల ర్యాలీలు, సమావేశాలపై నిషేధాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. పార్టీల ఎన్నికల సభలు, ర్యాలీలను ఆపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరింది. ఎన్నికలను వాయిదా వేయడాన్ని కూడా ప్రధాని ఆలోచించాలని అభ్యర్థించింది.
ఇదిలావుంటే.. అత్యధిక లోక్‌సభ స్థానాలను కలిగి ఉన్న ఉత్తరప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో కీలక పాత్ర పోషించే ఎన్నికలు. అత్యంత పోటీ ఉన్న ముఖ్యమైన ఎన్నికలు కూడా ఇవే. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించాయి. రాష్ట్రంలోని వివిధ పార్టీలు తరుపున జరిగిన ర్యాలీలకు పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. కోవిడ్ ప్రోటోకాల్‌లను అనుసరించే అవకాశం లేకుండా ప్రధాన మంత్రి, హోం మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీల నాయకులు భారీ బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో కూడా అనేక ర్యాలీలు, సభలు ప్లాన్ చేయబడ్డాయి. ఈ నేఫథ్యంలోనే అలహాబాద్ హైకోర్టు తాజా సూచన చేసింది.