అల‌ర్ట్ : డిసెంబరు నెలలో 18 రోజుల పాటు బ్యాంకు సెల‌వులు

డిసెంబర్‍‍‍‍‍‍‍‍‍‍ 2023కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం..

By Medi Samrat
Published on : 29 Nov 2023 4:05 PM IST

అల‌ర్ట్ : డిసెంబరు నెలలో 18 రోజుల పాటు బ్యాంకు సెల‌వులు

డిసెంబర్‍‍‍‍‍‍‍‍‍‍ 2023కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం.. డిసెంబర్ నెలలో మొత్తం 18 రోజుల పాటు బ్యాంకులు మూత‌బ‌డ‌నున్నాయి. ఈ సెలవుల్లో ఆదివారాలు, నెలలో రెండవ, నాల్గవ శనివారాలు కూడా ఉన్నాయి. ఈ 18 రోజుల సెలవుల్లో కస్టమర్లకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.

నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 ప్రకారం.. బ్యాంకుల‌ సెలవులు నాలుగు వేర్వేరు వర్గాలుగా విభజించబడ్డాయి. ఈ కేటగిరీలు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ కింద లభించే సెలవులు, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద లభించే సెలవులు, బ్యాంకు ఖాతాలను మూసివేయడానికి సంబంధించిన సెలవులు, రాష్ట్రాలు సూచించిన బ్యాంకు సెలవులుగా ఉంటాయి.

డిసెంబరు నెలలో బ్యాంకులకు ఏ రోజు, ఏ కారణంతో, ఎక్కడ సెలవులు ఉంటాయో చూద్దాం..

1. డిసెంబర్ 1 (శుక్రవారం): రాష్ట్ర స్థాపన దినోత్సవం/దేశీయ విశ్వాస దినోత్సవం కారణంగా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లలో బ్యాంకులు మూసివేయబడ‌తాయి.

2. డిసెంబర్ 3 (ఆదివారం): వారపు సెలవు

3. డిసెంబర్ 4 (సోమవారం): సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ, గోవాలో బ్యాంకులు మూసివేయబడతాయి.

4. డిసెంబర్ 9 (శనివారం): రెండవ శనివారం సెలవు

5. డిసెంబర్ 10 (ఆదివారం): వారపు సెలవు

6. డిసెంబర్ 12 (మంగళవారం): పో-టోగన్ నెంగ్మింజా సంగ్మా కారణంగా మేఘాలయలో బ్యాంకులు మూతపడ‌తాయి.

7. డిసెంబర్ 13 (బుధవారం): లుసుంగ్/నామ్‌సంగ్- సిక్కింలో బ్యాంకులు బంద్ ఉంటాయి.

8. డిసెంబర్ 14 (గురువారం): లుసుంగ్/నామ్‌సంగ్- సిక్కింలో బ్యాంకులు బంద్ ఉంటాయి.

9. డిసెంబర్ 17 (ఆదివారం): వారపు సెలవు

10. 18 డిసెంబర్ (సోమవారం): యు సోసో థామ్ వర్ధంతి, మేఘాలయలో బ్యాంకులు మూసివేయబడ‌తాయి.

11. డిసెంబర్ 19 (మంగళవారం): గోవా విమోచన దినోత్సవం కార‌ణంగా బ్యాంకులు మూసివేయబ‌డ‌తాయి.

12. డిసెంబర్ 23 (శనివారం): నాల్గవ శనివారం సెలవు

13. 24 డిసెంబర్ (ఆదివారం): వారపు సెలవు

14. 25 డిసెంబర్ (సోమవారం): (క్రిస్మస్) - అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్‌

15.26 డిసెంబర్ (మంగళవారం): క్రిస్మస్ వేడుకలు- మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో బ్యాంకులు బంద్ ఉంటాయి.

16. 27 డిసెంబర్ (బుధవారం): క్రిస్మస్ - అరుణాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులు మూసివేస్తారు.

17. డిసెంబర్ 30 (శనివారం): U Kiang Nangbah- మేఘాలయలో బ్యాంకులు మూసివేస్తారు.

18. 31 డిసెంబర్ (ఆదివారం): వారపు సెలవు

Next Story