డిసెంబర్‌లో బ్యాంకు హాలిడేస్ ఇవే..

December Bank Holidays. ఇటీవ‌ల కాలంలో ప్ర‌తి ఒక్క‌రికీ బ్యాంకుల‌తో ప‌ని ఉంటుంది. ఇక క‌రోనా క‌ష్ట‌కాలంలో బ‌య‌ట తిరిగే వార

By Medi Samrat  Published on  30 Nov 2020 12:19 PM IST
డిసెంబర్‌లో బ్యాంకు హాలిడేస్ ఇవే..

ఇటీవ‌ల కాలంలో ప్ర‌తి ఒక్క‌రికీ బ్యాంకుల‌తో ప‌ని ఉంటుంది. ఇక క‌రోనా క‌ష్ట‌కాలంలో బ‌య‌ట తిరిగే వారు, బ్యాంకు ప‌నులు, ఇత‌ర‌త్రా ఆర్థిక లావాదేవీలు ప్లాన్ చేసుకోవాలి. డిసెంబ‌ర్ నెల‌లో బ్యాంకుల‌కు మొత్తం 7 రోజులు సెల‌వులు ఉన్నాయి. అనగా సెలవు జాబితాలో నాలుగు ఆదివారాలు, రెండవ మరియు నాల్గవ శనివారాలు అలాగే ఒక క్రిస్మస్ ఉన్నాయి. క‌నుక ఆయా రోజుల్లో బ్యాంకులకు సెల‌వులు ఉంటాయి. ఇవి తెలుసుకుని మీ బ్యాంకు ప‌నులను ప్లాన్ చేసుకోవ‌డం ఉత్త‌మం.

డిసెంబర్ 1 వ తేదీన జీహెచ్ఎంసి పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న బ్యాంకులకు డిసెంబర్ 1 వ తేదీన సెలవు ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు తెరిచి ఉంటాయి.

-డిసెంబర్ 06 ఆదివారం ఆదివారం

-డిసెంబర్ 12 రెండో శనివారం

-డిసెంబర్ 13 ఆదివారం

-డిసెంబర్ 20 ఆదివారం

-డిసెంబర్ 25 శుక్రవారం క్రిస్మస్

-డిసెంబర్ 26 నాలుగో శనివారం

-డిసెంబర్ 27 ఆదివారం

అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే బ్యాంకు సెలవులు ప్రభుత్వ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులకు వర్తిస్తాయని తెలిసిందే. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ https://www.rbi.org.in/ లో వివరాలు చెక్ చేసుకోవచ్చు. కాగా, ప్రతి రాష్ట్రంలోనూ సెలవు దినాలలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని తెలిసిందే.




Next Story