22కి చేరిన కల్తీ మద్యం మృతులు

Death toll in Aligarh hooch tragedy rises to 22. ఉత్తర్‌ప్రదేశ్‌ అలీగఢ్‌ పరిధిలోని కర్సువాలో కల్తీ మద్యంతాగి మృతిచెందిన వారి

By Medi Samrat  Published on  29 May 2021 10:28 AM GMT
22కి చేరిన కల్తీ మద్యం మృతులు

ఉత్తర్‌ప్రదేశ్‌ అలీగఢ్‌ పరిధిలోని కర్సువాలో కల్తీ మద్యంతాగి మృతిచెందిన వారి సంఖ్య 22 కి చేరింది. మరో 16 మంది పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది. ఒకే యజమానికి చెందిన రెండు దుకాణాల్లో బాధితులు మద్యం తాగినట్టు గుర్తించిన అధికారులు ఆ దుకాణాలను సీజ్‌ చేశారు. నిందితుడు అనిల్ చౌదరితో పాటు నలుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు కీలక నిందితులు రిషి శర్మ, విపిన్ యాదవ్ పరారీలో ఉన్నారు. ఈ నిందితులపై 50 వేల రివార్డును పోలీసులు ప్రకటించారు. నిందితుల నుండి లిక్కర్‌ బాటిల్స్‌, బ్యాంకు ఖాతా వివరాలు, బార్‌ కోడ్స్‌, రిజిస్టర్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అలీఘర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ సిబి సింగ్‌ తెలిపారు.

కల్తీ మద్యం తాగి ఇద్దరు మృతిచెందినట్లు లోధా పోలీసులకు తొలుత ఫిర్యాదు అందింది. ఘటనా ప్రాంతానికి చేరుకొని విచారణ చేపట్టగా.. కర్సువా గ్రామంతోపాటు పరిసర గ్రామాల్లోని కల్తీ మద్యం తాగి మొత్తం 11 మంది మృతిచెందినట్లు తేలింది. ఆయా గ్రామాలకు అదనపు పోలీసు సిబ్బంది చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించే ప్రయత్నంలో ఉండగా ఆసుపత్రి లో ఉన్న వారితో పాటు మరికొంతమంది మృతి చెందినట్టుగా తెలిసింది. దీంతో మృతుల సంఖ్య ప్రస్తుతం 22కి చేరింది.

ఇదిలావుండగా, ఈ విషయంలో జిల్లా ఎక్సైజ్ అధికారి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ సహా ముగ్గురు ఎక్సైజ్ శాఖ అధికారులను సస్పెండ్ చేసి వారిపై డిపార్ట్‌మెంటల్ విచారణ ప్రారంభించింది. పరీక్షల కోసం మద్యం నమూనాలను సేకరించిన అధికారులు దర్యాప్తు పూర్తయ్యే వరకు అలీఘర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 500 లైసెన్స్ పొందిన మద్యం షాపులలో విక్రయాలు నిలిపి వేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.





Next Story