నేరుగా మీదొచ్చి పడిన పిడుగు.. అక్కడే కుప్పకూలిన నలుగురు!

Deadly Lightening in Gurgaon. కొన్ని సార్లు చావు ఎలా వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు.. ఏ మూల నుంచి చావు తరుముతుందో

By Medi Samrat  Published on  13 March 2021 8:48 AM GMT
నేరుగా మీదొచ్చి పడిన పిడుగు.. అక్కడే కుప్పకూలిన నలుగురు!
కొన్ని సార్లు చావు ఎలా వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు.. ఏ మూల నుంచి చావు తరుముతుందో ఎవరికీ అర్థం కాదు. శుక్రవారం హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగిన ఒళ్లు గగుర్పొడిచే ఘటనను చూస్తే అదే అనిపిస్తుంది. సాధారణంగా మనుషులపై పిడుగు పడితే బూడిత అయిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. పిడుగు పాటుకి ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వేల వోల్టుల శక్తి ఉన్న పిడుగు మీదొచ్చి పడితే.. నిట్ట నిలువునా ప్రాణాలు పోతాయి.


అయితే పిడుగు పాటు పడినా ఓ నలుగురు మాత్రం ప్రాణాలతో బయటపడ్డ సంఘటన గురుగ్రామ్ సెక్టార్ 82లోని వాటికా సిగ్నేచర్ విల్లాస్ లో జరిగింది. నిన్న ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. భారీగా వర్షం పడుతుందన్న కారణంతో వాటికా సిగ్నేచర్ విల్లాస్ లో పనిచేసే నలుగురు తోటమాలీలు ఓ చెట్టు కిందకు వెళ్లి నిలబడ్డారు. అలా వారు వెళ్లారో లేదు.. కొద్ది సేపటికి పైనుంచి పిడుగు పడింది. దాంతో అక్కడే నలుగురూ కుప్పకూలారు.


అదృష్టం కొద్ది వారు బతికే ఉన్నారు. పిడుగు పడిన వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను శివదత్, లాలి, రాంప్రసాద్ సుందర్, అనిల్ గా గుర్తించారు. అందులో ఒకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని చెబుతున్నారు డాక్టర్లు. గత ఏడాది జూన్ లో పిడుగులు పడిన ఘటనల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందులో ఒక్క బీహార్ లోనే 82 మంది చనిపోయారు. ప్రతి సంవత్సరం 2 వేల మందికిపైగా దేశంలో పిడుగులకు బలైపోతున్నారు.




Next Story