ఎస్‌బీఐకి నోటీసు జారీ చేసిన మహిళా కమిషన్.. ఎట్టకేలకు..

DCW issues notice to SBI. గర్భిణీ మహిళా అభ్యర్థులకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ఇటీవల మహిళా

By Medi Samrat  Published on  29 Jan 2022 1:53 PM GMT
ఎస్‌బీఐకి నోటీసు జారీ చేసిన మహిళా కమిషన్.. ఎట్టకేలకు..

గర్భిణీ మహిళా అభ్యర్థులకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ఇటీవల మహిళా ఉద్యోగుల నియామకానికి సంబంధించి జారీచేసిన ఉత్తర్వులపై ఢిల్లీ మహిళా కమిషన్(DWC) తీవ్రంగా స్పందించింది. ఇది మహిళల పట్ల వివక్షచూపడమేకాకుండా చట్టవిరుద్ధమని, ఈ మహిళా వ్యతిరేక నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఎస్బీఐకి నోటీసులు జారీ చేసింది. గ‌ర్భిణి అభ్య‌ర్థుల విష‌యంలో 3 నెలలు దాటినవారే విధుల్లో చేరడానికి తాతాల్కికంగా అనర్హులంటూ స్టేట్‌ బ్యాంక్‌ ఇండియా సర్క్యులర్‌ జారీ చేయ‌డ‌మే వివాదానికి కార‌ణంగా మారింది.

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివల్ ట్విట్టర్ ద్వారా.. అసలు ఈ నిబంధనలను ఎలా రూపొందించారు? దీని వెనుక అధికారులు ఎవరు వున్నారు? అనేదానిపై వచ్చే మంగళవారంలోగా వివరణ ఇవ్వాలని ఎస్బీఐని కోరారు. "మూడు నెలలు నిండిన గర్భిణులు సర్వీసులో చేరకుండా నిరోధిస్తూ ఎస్బీఐ 2021 డిసెంబర్ 31న జారీ చేసిన మార్గదర్శకాలు 'వారిని తాత్కాలిక అన్ ఫిట్' అని పేర్కొనడం వివక్ష చూపించడమే. అంతేకాదు చట్ట విరుద్ధం కూడా. చట్ట ప్రకారం కల్పించిన మెటర్నిటీ ప్రయోజనాలపై ప్రభావం పడుతుంది. మహిళలకు వ్యతిరేకంగా ఉన్న ఈ నిబంధనను ఉపసంహరించుకోవాలని కోరుతూ నోటీసు జారీ చేశాం" అని ట్వీట్ లో తెలిపారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 నెలల కంటే ఎక్కువ గర్భిణీ స్త్రీలను సేవలో చేరకుండా నిరోధించడానికి మార్గదర్శకాలను జారీ చేసినట్లు కనిపిస్తోంది. వారిని 'తాత్కాలికంగా అన్‌ఫిట్' అని పేర్కొనడం వివక్ష చూపించడమే కాకుండా.. చట్టవిరుద్ధం అని పలువురు ఎస్బీఐని విమర్శించారు.

దీంతో వెన‌క్కి త‌గ్గిన ఎస్బీఐ మునుపటి నిబంధనల ప్రకారం, గర్భిణీ స్త్రీల అభ్యర్థులు గర్భం దాల్చిన ఆరు నెలల వరకు బ్యాంకులో నియమించబడటానికి అర్హుల‌ని స్ప‌ష్టం చేసింది. కొత్తగా ఉద్యోగంలో చేరేవారు, పదోన్నతులపై కొత్త పదవిలో చేరేవారి కోసం ఎస్బీఐ 2021 డిసెంబరు 31న నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. డిసెంబరు 31నాటి ఎస్బీఐ సర్క్యులర్‌ లో మూడు నెలల నిండిన గర్భిణీ స్త్రీలను విధిగా ఎంపిక చేసినప్పటికీ ఉద్యోగంలో చేరకుండా నిలిపివేసింది. దీని ప్రకారం నియామక సమయానికి 3 నెలలకు మించి గర్భంతో ఉన్న మహిళలు ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హతకు గురవుతారు. వారు బిడ్డను ప్రసవించాక 4 నెలల్లోపు ఉద్యోగంలో చేరేందుకు అనుమతిస్తామని పేర్కొంటూ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఈ సర్క్యులర్ లో నిబంధనలను వెనక్కు తీసుకుంది.



Next Story