నాన్న లైంగికంగా వేధించేవాడు : స్వాతి మలివాల్
DCW chief Swati Maliwal says father sexually assaulted her. సొంత ఇంట్లోనే భయంతో బతికానని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ తెలిపారు
By Medi Samrat Published on 11 March 2023 6:15 PM IST
DCW chief Swati Maliwal
చిన్నతనంలో మా నాన్న నన్ను లైంగికంగా వేధించేవాడని.. దీంతో నా సొంత ఇంట్లోనే భయంతో బతికానని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ తెలిపారు. నా తండ్రి నన్ను అనవసరంగా కొట్టేవాడు, నా జుట్టు పట్టుకుని గోడకు తలను కొట్టేవాడు. భయంతో మంచం కింద దాక్కుని చాలా రాత్రులు గడిపానని శనివారం ఢిల్లీలో జరిగిన డీసీడబ్ల్యూఅవార్డ్స్ కార్యక్రమంలో స్వాతి తన బాధను వివరించింది.
స్వాతి మాట్లాడుతూ.. 'మా నాన్న నన్ను లైంగికంగా వేధించేవారని నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆయన ఇంటికి వస్తుంటే నాకు చాలా భయంగా అనిపించేది. మంచం కింద ఎన్ని రాత్రులు గడిపానో నాకే తెలియదు. నేను భయంతో వణికిపోయేదాన్ని. అలాంటి మగవాళ్లందరికీ గుణపాఠం చెప్పాలంటే.. నేనేం చేయాలో ఆ సమయంలోనే ఆలోచించానని పేర్కొన్నారు.
మా నాన్నకి కోపం వచ్చి నా జుట్టు పట్టుకుని గోడకి కొట్టడం, రక్తం కారడం, నాకు చాలా బాధ అనిపించడం నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ తపన వల్లే.. ఇలాంటివారికి ఎలా గుణపాఠం చెప్పాలనే ఆలోచన ఒక్కటే నా మదిలో మెదిలింది. నా జీవితంలో మా అమ్మ, మా అత్తలు లేకుంటే.. ఆ చిన్ననాటి గాయం నుంచి బయటపడే అవకాశం ఉండేది కాదని ఆమె తన గతాన్ని వివరించారు.
అణచివేత ఎక్కువగా ఉన్నప్పుడు.. మార్పు కూడా అదేరీతిలో ఉంటుందని నేను గ్రహించాను. అణచివేత మీలో మంటను రేకెత్తిస్తుంది.. మీరు దానిని సరైన స్థితిలో ఉంచినట్లయితే.. మీరు గొప్ప పనులు చేయవచ్చు. ఈ రోజు మనం అవార్డు గ్రహీతలందరినీ చూస్తాము, వారికి ఒక కథ ఉంది. ఆ వ్యక్తులు తమ జీవితంతో పోరాడటం నేర్చుకున్నారు. ఆ సమస్య నుండి ఎదగడం నేర్చుకుంటారు. వారి సమస్యలను దృఢంగా ఎదుర్కొన్న అటువంటి బలమైన మహిళలు ఈరోజు మనతో ఉన్నారని ప్రసంగించారు.
తాజాగా నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు సుందర్.. తన తండ్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. 8 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. నా తండ్రి నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తల్లిని కూడా కొట్టేవాడని.. నాకు 15 ఏళ్లు వచ్చేసరికి ఈ నేరాన్ని ఎదిరించే ధైర్యం వచ్చిందని పేర్కొన్నారు.