అతడిని అడ్డుకున్నందుకు 5 లక్షల జరిమానా

DCGA imposes ₹5 lakh fine on airline for denying boy with special needs to board flight. రాంచీ విమానాశ్రయంలో దివ్యాంగ బాలుడిని విమానం ఎక్కేందుకు

By Medi Samrat
Published on : 28 May 2022 9:00 PM IST

అతడిని అడ్డుకున్నందుకు 5 లక్షల జరిమానా

రాంచీ విమానాశ్రయంలో దివ్యాంగ బాలుడిని విమానం ఎక్కేందుకు అనుమతించకుండా అడ్డుకున్న ఇండిగో ఎయిర్ లైన్స్ పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చర్యలు తీసుకుంది. బాలుడి పట్ల విమానయాన సంస్థ గ్రౌండ్ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించినట్టు నిర్ధారించిన డీజీసీఐ రూ. 5 లక్షల జరిమానా విధించింది. ప్రత్యేక పరిస్థితుల్లో మరింత అసాధారణంగా స్పందించాల్సిన ఎయిర్‌లైన్ సిబ్బంది సందర్భానికి అనుగుణంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని విమర్శించింది. కాబట్టి విమానయాన సంస్థపై రూ. 5 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించినట్టు పేర్కొంది.

హైదరాబాద్ వెళ్లేందుకు కుమారుడితో కలిసి రాంచీ విమానాశ్రయానికి కుటుంబాన్ని ఇండిగో విమాన సిబ్బంది అడ్డుకున్నారు. బాలుడు భయపడుతున్నాడని, అతడి వల్ల తోటి ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉందని, కాబట్టి బోర్డింగ్‌కు అనుమతించబోమని తేల్చి చెప్పారు. మనీషా గుప్తా అనే ప్రయాణికురాలు ఈ ఘటనను వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్ చేయడంతో ఇండిగో తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పడమే కాకుండా బాలుడికి ఎలక్ట్రిక్ వీల్‌చైర్ కొని ఇస్తామని ఇండిగో సీఈవో రోనోజోయ్ దత్తా ప్రకటించారు.










Next Story