అమర్త్యసేన్ చనిపోలేదు.. బ్రతికే ఉన్నారు
ప్రఖ్యాత ఆర్ధిక వేత్త, నోబెల్ అవార్డ్ గ్రహీత అమర్త్యసేన్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
By Medi Samrat Published on 10 Oct 2023 9:00 PM ISTప్రఖ్యాత ఆర్ధిక వేత్త, నోబెల్ అవార్డ్ గ్రహీత అమర్త్యసేన్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అది నిజమేనని పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అమర్త్యసేన్ క్షేమంగానే వున్నారని ఆయన కుమార్తె నందన దేబ్ సేన్ స్పష్టం చేశారు. ఇది ఫేక్ న్యూస్ అని.. బాబా క్షేమంగా వున్నారని తెలిపారు. అంతేకాకుండా తాము కేంబ్రిడ్జ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి అద్భుతమైన వారాన్ని గడిపాము. ఆయన హార్వర్డ్‌లో వారానికి 2 కోర్సులు బోధిస్తున్నారని తెలిపారు. ఆయన ఎప్పటిలాగే బిజీగా ఉన్నారంటూ స్పష్టం చేశారు.
1933 నవంబర్ 3న పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లో జన్మించిన అమర్త్యసేన్ ఢాకాలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. 1947లో దేశ విభజన తర్వాత భారత్‌కు వచ్చిన ఆయన విశ్వభారతి, ప్రెసిడెన్సీ కాలేజీలలో చదువుకున్నారు. కేంబ్రిడ్జిలోని ట్రినిటి కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్, 1959లో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. అమర్త్యసేన్‌కు 1998లో ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతి, 1999లో భారత అత్యున్న పురస్కారం భారతరత్న వరించింది. ఆయన చనిపోయారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు ఆయన కుటుంబ సభ్యులు.
వార్తా సంస్థ PTI "ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత క్లాడియా గోల్డిన్ అమర్త్య సేన్ నిమిషాల క్రితం మరణించారు" అని ట్వీట్ చేయడంతో అది కాస్తా వైరల్ మారింది. కొన్ని నిమిషాల తర్వాత, తన తండ్రి సజీవంగా ఉన్నారని, క్షేమంగా ఉన్నారని సేన్ కుమార్తె స్పష్టం చేశారని వార్తా సంస్థ ట్వీట్ చేసింది.