కోర్టులో పేలిన బాంబు.. ముగ్గురు పోలీసులకు గాయాలు..
Crude bomb produced as evidence explodes in Patna court. బీహార్‌లోని పాట్నాలోని సివిల్ కోర్టులో శుక్రవారం సాక్ష్యంగా సమర్పించిన ముడి బాంబు
By Medi Samrat Published on 2 July 2022 8:08 AM GMTబీహార్‌లోని పాట్నాలోని సివిల్ కోర్టులో శుక్రవారం సాక్ష్యంగా సమర్పించిన ముడి బాంబు పేలడంతో సబ్ ఇన్‌స్పెక్టర్‌తో సహా మరో ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. ఘటనలో సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేతికి గాయమైంది, అయితే ప్రమాదం నుండి బయటపడినట్లు సంఘటనా స్థలంలో ఉన్న పిర్బహోర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ సబియుల్ హక్ తెలిపారు.
కొన్ని ముడి బాంబులను తీసుకువచ్చిన పోలీసులు.. నిందితులకు వ్యతిరేకంగా రుజువుగా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అయితే.. కోర్టులో టేబుల్‌పై ఉంచిన వెంటనే బాంబులలో ఒకటి పేలిందని వార్తా సంస్థ ఐఎఎన్ఎస్ నివేదించింది.
పేలుడు ప్రభావం తీవ్రంగా ఉంది, కోర్టులో ఉన్న చాలా మంది అధికారులు, న్యాయవాదులు రెండు నిమిషాల పాటు వినికిడి శక్తిని కోల్పోయారు. కోర్టులో సంఘటన జరిగినప్పుడు న్యాయమూర్తి కూడా ఉన్నారు. ప్రమాదం నుండి బయటపడ్డ జడ్జి సురక్షితంగా ఆయన ఛాంబర్‌కు తిరిగి వెళ్లినట్టు IANS నివేదించింది.
వాహన రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో సాధారణంగా ఉండే టైర్ పేలిన శబ్దం అని తాము మొదట భావించామని చుట్టుపక్కల ఉన్నవారు తెలిపారు. అయితే.. పేలుడు తర్వాత ఆ ప్రాంతమంతా మసితో కప్పబడి ఉండటంతో ఏదో జరిగే ఉంటుందని గ్రహించినట్లు తెలిపారు. కోర్టుకు తీసుకురావడానికి ముందు బాంబులను సరిగ్గా నిర్వీర్యం చేశారా లేదా అని తెలుసుకోవడానికి పరిశోదనలు కొనసాగుతున్నాయని పిర్బహోర్ ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.
SSP మానవజీత్ సింగ్ ధిల్లాన్, సంబంధిత పోలీసు స్టేషన్‌లోని ఇతర అధికారులు కోర్టుకు చేరుకుని ఆ ప్రాంతాన్ని సీలు చేశారు. వెంటనే డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి కోర్టుకు చేరుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై పాట్నా పోలీసులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదని IANS తెలిపింది.