గుజరాత్ ఎన్నికలకు బీజేపీ రెడీ అవుతోంది. గుజరాత్ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితా ఊహించిన దానికంటే ముందుగానే విడుదల చేసింది బీజేపీ. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబాకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. అలాగే విరాంగ్రామ్ నుంచి సామాజిక కార్యకర్త, పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు హార్ధిక్ పటేల్ కి ఎమ్మెల్యే టికెట్ లభించింది. 2019లో బీజేపీలో చేరిన జడేజా భార్య రివాబాని గుజరాత్ నార్త్ జామ్‌నగర్ నుంచి బరిలోకి దిగనుంది. సిట్టింగుల్లో 38 మందికి సీట్లు ఇవ్వలేదు. మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనకు సంబంధించి అక్కడి స్థానిక ఎమ్మెల్యేకి సీటు దక్కనివ్వలేదు.
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నుంచి పోటీ చేయనున్నారు. గుజరాత్‌లో ఇప్పుడు 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తన సీనియర్ నేతలను కొందరిని రంగంలోకి దించలేదు, వీరిలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వంటి వారు ఉన్నారు. రివాబా జడేజా, నెలల తరబడి గ్రామాలలో పర్యటిస్తూ తనకు పాపులారిటీని పెంచుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రముఖుడు హరి సింగ్ సోలంకికి రివాబా బంధువు. ఆమె 2016లో రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. ఆమె జామ్‌నగర్-సౌరాష్ట్ర ప్రాంతంలో రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు.