ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించగా.. ఆయన దేశానికి కొత్త ఉపరాష్ట్రపతి కాబోతున్నారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు వచ్చాయి. విపక్షాలు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి బి. సుదర్శన్‌రెడ్డిని బరిలోకి దింపగా.. ఆయనకు 300 ఓట్లు మాత్రమే వచ్చాయి. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన మొత్తం 781 మంది ఎంపీలకు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంది.
ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగిందని బీజేపీ ఆరోపించింది. ప్రతిపక్ష పార్టీలు ఐక్యతను ప్రదర్శించాయని, తమ 315 మంది ఎంపీలు ఓటేశారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 100 శాతం హాజరు నమోదైందన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపరాష్ట్రపతి ఎన్నికలో 96 శాతం ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది.. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.