కోవిషీల్డ్‌, కోవాగ్జిన్ క‌లిస్తే అద్భుత ఫలితాలు : ఐసీఎంఆర్‌

Covishield, Covaxin mix can give better results. కరోనా పోరులో భాగంగా ప్రస్తుతం భార‌త్‌లో అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లు

By Medi Samrat  Published on  8 Aug 2021 9:14 AM GMT
కోవిషీల్డ్‌, కోవాగ్జిన్ క‌లిస్తే అద్భుత ఫలితాలు : ఐసీఎంఆర్‌

కరోనా పోరులో భాగంగా ప్రస్తుతం భార‌త్‌లో అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లు కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌. అయితే.. ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌ నగర్‌లో గతంలో 18 మందికి రెండు వేర్వేరు టీకాల(కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌) మోతాదులను పొరపాటున ఇచ్చారు. ఇప్పుడు ఆ వ్యక్తులను పరిశీలించగా విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆ వ్యక్తులలో రోగనిరోధక శ‌క్తిని పరిశీలించగా.. ఇలా రెండు వేర్వేరు వ్యాక్సిన్లను రెండు డోసులుగా తీసుకున్న వాళ్లలో రోగనిరోధక శ‌క్తి ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఐసీఎంఆర్‌, పూణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సంయుక్తంగా ఈ అధ్యయనం చేపట్టాయి.

అయితే.. ఈ వ్యాక్సిన్ డోసుల‌ను ఉద్దేశ పూర్వకంగా మిక్స్‌ చేయలేదు. పొరపాటున జరగ్గా.. అనంతరం పూణెలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ వీరిని జాగ్రత్తగా పరిశీలించింది. కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ ఒకేలాంటి డోసులను తీసుకున్న వాళ్లలోని రోగనిరోధక శక్తి, ఆ వ్యాక్సిన్లు ఇచ్చే రక్షణను వీళ్లతో పోల్చి చూసింది. ఈ ఫలితాల్లో రెండు వ్యాక్సిన్లు మిక్స్‌ అయిన వాళ్లలో ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లను తట్టుకునే శక్తి అధికంగా ఉందని వెల్లడైంది. ఇలాంటి వాళ్లలో యాంటీబాడీల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ విష‌య‌మై ఐసీఎంఆర్ అధ్యయన ఫలితాన్ని ఆదివారం విడుదల చేసింది.


Next Story