జనవరి మధ్యలో గరిష్ట స్థాయికి థ‌ర్డ్‌ వేవ్.. రోజుకు 4 నుండి 8 ల‌క్ష‌ల కేసులు చూసే అవ‌కాశం..!

COVID third wave peak in mid-January. భారత్‌లో కొనసాగుతున్న కోవిడ్-19 థ‌ర్డ్‌ వేవ్ గరిష్ట స్థాయికి జనవరి చివరి వారంలో లేదా

By Medi Samrat  Published on  9 Jan 2022 6:48 AM GMT
జనవరి మధ్యలో గరిష్ట స్థాయికి థ‌ర్డ్‌ వేవ్.. రోజుకు 4 నుండి 8 ల‌క్ష‌ల కేసులు చూసే అవ‌కాశం..!

భారత్‌లో కొనసాగుతున్న కోవిడ్-19 థ‌ర్డ్‌ వేవ్ గరిష్ట స్థాయికి జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి ప్రారంభంలో రావచ్చని ఐఐటి-కాన్పూర్ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ తెలిపారు. ఆ స‌మ‌యంలో దేశంలో రోజుకు నాలుగు నుండి ఎనిమిది లక్షల కేసులను చూసే అవకాశం ఉందని.. ఇది సెకండ్‌ వేవ్ యొక్క గరిష్ట స్థాయికి దాదాపు రెండు రెట్లు ఎక్కువ అని అని ఆయ‌న అన్నారు. ముంబయి, ఢిల్లీ వంటి పెద్ద నగరాలు ముందుగానే, అంటే ఈ నెల మధ్యలో గరిష్ట స్థాయిని చూసే అవకాశం ఉందని అగర్వాల్ చెప్పారు. వేరియంట్‌ ప్రస్తుత దశను ఇంకా సంగ్రహించలేకపోయినందున.. దేశంలో ప‌రిస్థితిని అంచనా వేయడం చాలా కష్టం. జనవరి-చివరి/ఫిబ్రవరి-ప్రారంభంలో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని మేము అంచనా వేస్తున్నాము. రోజుకు 4-8 లక్షల కేసుల మధ్య ఉండవచ్చు (7 రోజుల సగటు) అని ఆయన చెప్పారు.

దేశంలో అంటువ్యాధులు అంచనా వేసే ముగ్గురు సభ్యుల నిపుణుల బృందంలో ఉన్న‌ అగర్వాల్ మాట్లాడుతూ.. జనవరి మధ్య నాటికి ముంబైలో 30,000 నుండి 60,000 COVID-19 కేసులు నమోదు అవుతాయని భావిస్తున్నారు. ఢిల్లీలో, ఈ నెల మధ్య నాటికి 35,000 నుండి 70,000 కరోనావైరస్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. కొత్త ఒమిక్రాన్ వేరియంట్ అధిక వ్యాప్తిని చూపించిందని, అయితే దాని తీవ్రత డెల్టా వేరియంట్‌లో కనిపించే విధంగా లేదని అగర్వాల్ చెప్పారు. తక్కువ హాస్పిటలైజేషన్ రేట్ కారణంగా ప్రస్తుతం థ‌ర్డ్‌ వేవ్ లో ఇబ్బంది లేద‌ని, రాబోయే కొద్ది వారాల్లో పరిస్థితులు మారవచ్చని ఆయన అన్నారు.


Next Story