భారతదేశంలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. కడుపులో ఉన్న బిడ్డకు కరోనా సోకింది. తల్లి నుండి కడుపులో ఉన్న బిడ్డకు కూడా కరోనా మహమ్మారి సోకింది. ఈ ఘటన హర్యానాలో జరిగింది. ఇప్పటిదాకా తల్లి కడుపులోని బిడ్డకు కరోనా సోకదని చాలా మంది నిపుణులు చెబుతూ ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో నిపుణులు కూడా షాక్ అవుతూ ఉన్నారు.
కరోనా పాజిటివ్ ఉన్న ఓ మహిళ కరోనా పాజిటివ్ ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది. తొలుత ఆమె భర్తకు కరోనా పాజిటివ్ రాగా.. ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమెకూ పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలోనే పురిటి నొప్పులు రావడంతో పలు ఆసుపత్రులకు తిరిగారు. చాలా ప్రైవేట్ ఆసుపత్రులు ఆమెను చేర్చుకునేందుకు అంగీకరించలేదు.
ఆయుష్మాన్ భవ్ ఆసుపత్రి యాజమాన్యం ఆమెను చేర్చుకుని ప్రసవం చేసింది. తర్వాత పుట్టిన బిడ్డకూ కరోనా ఉన్నట్టు గుర్తించి డాక్టర్లు షాక్ అయ్యారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా అరుదు అని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాల్సిందేనని అంటున్నారు.