భారీగా పెరిగిపోతున్న కరోనా కేసులు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి..?

Covid 19 Cases Hike In India. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరోసారి పెరుగుతోంది.

By Medi Samrat  Published on  25 April 2022 7:55 AM GMT
భారీగా పెరిగిపోతున్న కరోనా కేసులు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి..?

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరోసారి పెరుగుతోంది. సోమవారం దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదు కాగా వైరస్‌ కారణంగా 30 మంది మృతిచెందారు. 862 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 16,522 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,30,60,086కు చేరింది. ఇందులో 4,25,21,341 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతిచెందారు. 16,522 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1862 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. 12 రాష్ట్రల్లో వారం రోజుల నుంచి కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముందు వారంతో పోలిస్తే ఈ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రెట్టింపయింది. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతున్నాయి.

కరోనా భయం కారణంగా సోమవారం ఉదయం స్టాక్‌ మార్కెట్‌లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. కార్పొరేట్‌ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, విదేశీ ఇన్వెస్టర్లు, పెరిగిపోతున్న కరోనా కేసులు, ఉక్రెయిన్‌ రష్యా యుద్ధ పరిణామాల నుంచి దేశీయ ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దేశంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితి, నియంత్రణ చర్యలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. ఈ భేటీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ కీలక సూచనలు చేయనున్నారు.

Next Story