ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిషీల్డ్ ఒక్కో డోస్ ఎంతో తెలుసా..?

Covaxin to now cost private hospitals Rs 225 per dose. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క కోవిడ్-19 వ్యాక్సిన్ 'కోవిషీల్డ్' ఒక డోస్ ఇప్పుడు

By Medi Samrat  Published on  9 April 2022 11:56 AM GMT
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిషీల్డ్ ఒక్కో డోస్ ఎంతో తెలుసా..?

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క కోవిడ్-19 వ్యాక్సిన్ 'కోవిషీల్డ్' ఒక డోస్ ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులలో రూ.600కి బదులుగా రూ.225 కి అమ్మనున్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత ప్రైవేట్ ఆసుపత్రుల కోసం కోవిడ్ -19 వ్యాక్సిన్ ధరలను తగ్గించాలని వ్యాక్సిన్ తయారీదారు నిర్ణయించినట్లు SII CEO అదార్ పూనావాలా శనివారం ఒక ట్వీట్‌లో తెలిపారు.

బూస్టర్ డోస్ షురూ :

పద్దెనిమిదేళ్ల పైబడిన వారికి ఈనెల 10వ తేదీ నుంచి ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవిడ్ బూస్టర్ డోస్‌లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం శుక్రవారం నాడు ప్రకటించింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన 18 ఏళ్ల వయస్సు కలిగిన వారు ఈ బూస్టర్ డోస్ తీసుకునేందుకు అర్హులని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అర్హత గల పౌరులకు ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్ల ద్వారా మొదటి, రెండవ విడత వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియతో పాటు హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్ల పైబడిన వారికి ఇస్తున్న బూస్టర్ డోస్ ప్రక్రియ కొనసాగుతోంది. దీనిని మరింత వేగవంతం చేస్తున్నామని కేంద్రం తెలిపింది. దేశంలో 15 ఏళ్లు పైబడిన వారిలో 96 శాతం మంది కనీసం ఒక విడత వ్యాక్సిన్ డోస్ తీసుకోగా, 83 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏళ్ల పైబడిన వారికి ఇంతవరకూ 2.4 కోట్ల మంది బూస్టర్ డోస్‌లు తీసుకున్నారు. 18 ఏళ్లు పైబ‌డ్డ వారందరూ బూస్ట‌ర్ డోస్ తీసుకోవాల్సిందేన‌ని ప్ర‌క‌టించిన కేంద్ర ప్ర‌భుత్వం.. ఈ నెల 10 (ఆదివారం) నుంచి బూస్ట‌ర్ డోస్ పంపిణీని మొద‌లుపెట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. బూస్ట‌ర్ డోస్ పంపిణీని ప్రైవేట్ కేంద్రాల ద్వారా చేయనున్నట్టు కూడా కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.













Next Story