మాజీ హోంమంత్రికి వరుస షాక్ లు..!
Court remands Anil Deshmukh in ED custody till Nov 12. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కి ఆదివారం బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది.
By Medi Samrat Published on 7 Nov 2021 12:37 PM GMTమహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కి ఆదివారం బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను బాంబే హైకోర్టు ఆదివారం రద్దు చేసి, నవంబర్ 12 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి పంపింది. జ్యుడీషియల్ కస్టడీకి పంపాలన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి ఈ నెల 12వ తేదీ వరకు ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి పంపింది.
శనివారం పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు శనివారం మాజీ హోంమంత్రిని కస్టడీని పొడగించేందుకు నిరాకరిస్తూ.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపిన విషయం తెలిసిందే. ఆయన్ను ఈ నెల 1న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. ఈ కేసులో ఈడీ పలుసార్లు సమన్లు జారీ చేయగా ఆయన విచారణకు హాజరుకాలేదు. సీబీఐ కూడా అనిల్ దేశ్‌ముఖ్‌ను కస్టడీకి కోరనున్నట్లు సమాచారం. మాజీ మంత్రిపై దర్యాప్తు సంస్థ ఏప్రిల్‌లో కేసు నమోదు చేసింది. అదే సమయంలో అనిల్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో తన పదవిని దుర్వినియోగం చేశారని ఈడీ ఆరోపించింది.
ముంబైలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలని సస్పెండ్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజేను అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించినట్టు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ గతంలో ఆరోపణలు వచ్చాయి. పెద్ద ఎత్తున అనిల్ దేశ్ ముఖ్ పై వ్యతిరేకత రావడంతో అనిల్ దేశ్ ముఖ్ హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు. మాజీ మంత్రిపై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించడంతో.. సమన్లు జారీ చేసిన ఈడీ విచారణ అనంతరం ఆయనను అరెస్ట్ చేసింది. ఈడీ సమన్ల రద్దు కోరుతూ శుక్రవారం బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అనిల్ దేశ్ ముఖ్ కు ఊరట లభించలేదు. ఇక ఆయన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.