విడాకులు కోరుకుంటున్న మాజీ సీఎం.. కానీ..

జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ఆయన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు మంజూరు చేసేందుకు

By Medi Samrat  Published on  12 Dec 2023 5:49 PM IST
విడాకులు కోరుకుంటున్న మాజీ సీఎం.. కానీ..

జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ఆయన భార్య పాయల్ అబ్దుల్లాతో విడాకులు మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. విడాకుల పిటిషన్ ను కొట్టివేస్తూ ఫ్యామిలీ కోర్టు తీసుకున్న నిర్ణయం సరైనదేనని హైకోర్టు అభిప్రాయపడింది. తన భార్య క్రూరత్వంపై ఒమర్ అబ్దుల్లా ఆరోపణలు స్పష్టంగా లేవని.. ఆరోపణలకు సరైన ఆధారాలు కూడా లేవని వ్యాఖ్యానించింది. కింది కోర్టు తీర్పుపై వేసిన అప్పీల్ పిటిషన్ లో ఎలాంటి మెరిట్స్ లేవని తెలిపింది. ఒమర్ అబ్దుల్లా పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నామని జస్టిస్ సచ్ దేవ, జస్టిస్ వికాస్ మహాజన్ లతో కూడిన ధర్మాసనం చెప్పింది. ఒమర్ అబ్దుల్లా భార్య పాయల్ రాజస్థాన్ కాంగ్రెస్ అగ్రనేత సచిన్ పైలట్ చెల్లెలు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పటికే వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు.

తన భార్య నుంచి విడాకులు కోరుతూ ఒమర్​ అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్​ను తోసిపుచ్చింది ఢిల్లీ హైకోర్టు. విడాకులు కోరేందుకు అబ్దుల్లా వద్ద బలమైన కారణాలు లేవని తేల్చి చెప్పింది. జస్టిస్​ సంజీవ్ సచ్‌దేవా, జస్టిస్​ వికాస్​ మహాజన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం అబ్దుల్లా విడాకుల పిటిషన్​ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. అంతకుముందు ఇదే కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా ఢిల్లీ హైకోర్టు సమర్థించింది.

Next Story