సీఎం కేజ్రీవాల్ క‌స్టడీ పొడిగింపు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శుక్ర‌వారం ఉద‌యం సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది.

By Medi Samrat  Published on  12 July 2024 4:06 PM IST
సీఎం కేజ్రీవాల్ క‌స్టడీ పొడిగింపు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శుక్ర‌వారం ఉద‌యం సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. ఈడీ అరెస్ట్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రస్తుతానికి ఆయ‌న‌ జైలులోనే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే.. సీబీఐ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రోస్ అవెన్యూ కోర్టు జూలై 25 వరకు పొడిగించింది. ఇవాళ ఆయన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సీబీఐ కోర్టులో హాజరుపరిచింది. జూన్ 26న కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. మద్యం కుంభకోణంలో అవినీతి కేసును సీబీఐ విచారిస్తోంది.

ఈరోజు ఉదయం అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయ‌న‌ ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నాడు. దీంతో ప్రస్తుతానికి ఆయ‌న‌ జైలులోనే ఉండవలసి ఉంటుంది. అంతకుముందు మే 17న కేజ్రీవాల్ పిటిషన్‌పై ధర్మాసనం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.

ఈడీ అరెస్టును సవాలు చేస్తూ ఆయన వేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఢిల్లీలో జరిగిన ఆరోపించిన ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆయనను అరెస్టు చేయడాన్ని పిటిషన్ సవాలు చేసింది. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విస్తృత ధర్మాసనానికి పంపింది. అక్క‌డ ఆయ‌న‌కు మధ్యంతర బెయిల్ మంజూరు అయ్యింది.

Next Story