మహిళ కడుపులో దూది మరిచి ఆపరేషన్‌.. ఆసుపత్రిపై క్రిమినల్ కేసు

Cotton left in woman's stomach during operation.. Gurugram court orders case against doctors. సిజేరియన్ తర్వాత ఒక మహిళ తన బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ మహిళకు ఆపరేషన్‌ చేసిన

By అంజి  Published on  20 Jan 2022 8:07 AM GMT
మహిళ కడుపులో దూది మరిచి ఆపరేషన్‌.. ఆసుపత్రిపై క్రిమినల్ కేసు

సిజేరియన్ తర్వాత ఒక మహిళ తన బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ మహిళకు ఆపరేషన్‌ చేసిన వైద్యులు మాత్రం నిర్లక్ష్యం వహించారు. ఆపరేషన్‌ సమయంలో మహిళ కడుపులో దూదిని అలాగే వదిలేశారు. తాజాగా ఈ ఘటనపై విచారణ చేపట్టిన గురుగ్రామ్‌ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైద్యపరమైన నిర్లక్ష్యంగా ఆరోపించి ఇద్దరు వైద్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

మహిళ భర్త, దివాస్ రాయ్.. "కోవిడ్ కారణంగా లాక్డౌన్ ఉంది. నేను నా ఉద్యోగం కోల్పోయాను" అని కోర్టుకు ఫిర్యాదు చేశాడు. అలాంటి పరిస్థితిలో నా వద్ద డబ్బులు లేకపోవడంతో భార్యను ప్రభుత్వ అంగన్‌వాడీ కేంద్రానికి తీసుకెళ్లాడు. అంగన్‌వాడీ కార్యకర్త నా భార్యను సెక్టార్-12లోని శివ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. "నేను నా భార్యను శివా హాస్పిటల్‌కి తీసుకెళ్లగా, వైద్యులు ఆమెకు నవంబర్ 16, 2020 న శస్త్రచికిత్స చేశారు. ఆడపిల్ల జన్మించింది. ఆసుపత్రి నా నుండి రూ. 30,000 వసూలు చేసింది" అని అతను చెప్పాడు.

ఆసుపత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది

సెక్టార్ 12లో శివ హాస్పిటల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ గతంలో చేసిన అభ్యర్థనలను పోలీసులు తిరస్కరించిన మహిళ భర్త ఫిర్యాదుపై గుర్గోవాన్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. డెలివరీ అయిన వెంటనే, తన భార్యకు కడుపు నొప్పి, కడుపులో ఎర్రటి గుర్తులతో వాపు మొదలైందని, ఆ తర్వాత అతను మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లాడని, అక్కడ వైద్యులు ఆమెకు నొప్పిని తగ్గించడానికి కొన్ని విటమిన్లు, ఇతర మందులు ఇచ్చారని బాధితురాలి భర్త దివాస్‌ రాయ్ చెప్పారు.

కానీ శివ హాస్పిటల్ వైద్యులు ఇచ్చిన మందులు పని చేయకపోవడంతో, రాయ్ ఆమెను మరొక ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ వైద్యులు ఆమె కడుపులో ఏదో ఉందని అనుమానించి, మరొక చికిత్సను ప్రారంభించారు. తాను ఈ విషయాన్ని శివా హాస్పిటల్‌కు చెప్పిన తర్వాత.. వారు మొదట ఈ విషయాన్ని పట్టించుకోలేదని, అయితే ఆ తర్వాత నా ఇంటికి అంబులెన్స్‌ను పంపించి, నా భార్యను నాకు తెలియకుండా, సమ్మతించకుండా ఆసుపత్రిలో చేర్చారని అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. "ఆసుపత్రిలో, వారు ఆమెకు కొన్ని ఖాళీ ఫారమ్‌లపై సంతకం చేశారు. ఆమెకు శస్త్రచికిత్స చేసి, దూది తొలగించారు. నేను పోలీసుల వద్దకు వెళ్లగా.. వారు నా ఫిర్యాదును పట్టించుకోలేదు' అని రాయ్ తెలిపారు.

Next Story