బీజేపీ నేత ఇంటి ముందు పేలుడు.. పాకిస్థాన్ లింకులు

జలంధర్‌లోని బీజేపీ నాయకుడు మనోరంజన్ కాలియా ఇంటి వెలుపల జరిగిన గ్రెనేడ్ దాడికి సంబంధించి పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తితో సహా ఇద్దరిని అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు.

By Medi Samrat
Published on : 8 April 2025 7:33 PM IST

బీజేపీ నేత ఇంటి ముందు పేలుడు.. పాకిస్థాన్ లింకులు

జలంధర్‌లోని బీజేపీ నాయకుడు మనోరంజన్ కాలియా ఇంటి వెలుపల జరిగిన గ్రెనేడ్ దాడికి సంబంధించి పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తితో సహా ఇద్దరిని అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. ఈ కేసును 12 గంటల్లోనే ఛేదించామని, మత సామరస్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతో జరిగిన పెద్ద కుట్ర అని ఒక ఉన్నత పోలీసు అధికారి తెలిపారు. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) అర్పిత్ శుక్లా మాట్లాడుతూ, జీషన్ అక్తర్, పాకిస్తాన్‌కు చెందిన షాజెద్ భట్టి ఈ దాడి వెనుక కీలక కుట్రదారులని అన్నారు. నిషేధిత ఖలిస్తానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI)తో వారికి ఉన్న సంబంధాలను పోలీసులు పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు.

జలంధర్‌లోని బిజెపి నాయకుడు మనోరంజన్ కాలియా ఇంటి వెలుపల పేలుడు సంభవించింది. రాత్రి 1 గంట ప్రాంతంలో పేలుడు సంభవించింది. పేలుడు సమాచారం అందిన వెంటనే పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.సీసీటీవీని పరిశీలించగా.. నిందితుల్లో ఒకరు ఈ-రిక్షా దిగి హ్యాండ్‌ గ్రెనేడ్‌ లివర్‌ తీసి మాజీ మంత్రి ఇంట్లోకి విసిరినట్లు తేలింది. అనంతరం భారీ పేలుడు సంభవించింది.

Next Story