అమ్మాయిల జీన్స్ పై సీఎం సంచలన వ్యాఖ్యలు
Controversy For New Uttarakhand Chief Minister With Ripped Jeans Remark. ఉత్తరప్రదేశ్ లోని గ్రామాల్లో కట్టుబాట్లు విధిస్తూ అక్కడి
By Medi Samrat
ఉత్తరప్రదేశ్ లోని గ్రామాల్లో కట్టుబాట్లు విధిస్తూ అక్కడి పంచాయతీలు కలకలం రేపాయి. అమ్మాయిలు టైట్ జీన్స్, లెగ్గింగ్స్, టీషర్ట్స్, బిగుతుగా ఉండే వస్త్రాలు ధరించకూడదని తీర్పు ఇచ్చారు. మగవారు పొట్టి పొట్టి నెక్కర్లు, షార్ట్స్ ధరించవొద్దని తీర్మాణం చేశారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను రక్షించేందుకు ఈ తీర్పు ఇచ్చామని గ్రామపెద్దలు ప్రకటించారు. తమ తీర్పును కాదని, ఎవరైనా అమ్మాయి టైట్ జీన్స్, టీ షర్ట్స్, లెగ్గింగ్స్ లాంటివి వేసుకుని కనిపిస్తే, వారి కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేస్తామని ప్రకటించారు. గతంలో కూడా పలువురు నాయకులు, బాబాలు సైతం ఇలాంటి కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా అమ్మాయిలు జీన్స్ ధరించవొద్దని ఈ మాట అన్నది ఎవరో సాధారణ వ్యక్తి కానే కాదు. సాక్షాత్తూ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఎన్జీవోను నడిపిస్తున్న యువతి చిరిగిన జీన్స్ వేసుకోవడం చూసి షాకయ్యా. ఆ వేషధారణతో ఎన్జీవో విషయమై ప్రజలను కలవడానికి వెళితే.. సమాజానికి ఏం సంకేతాలిస్తున్నట్లు? మన పిల్లలకు ఏం సంకేతాలిస్తున్నట్లు? సమాజ సేవ చేసేవారు కనీస బాధ్యత లేకుండా ఇలాంటి వస్త్రాలు వేసుకుంటే ఎదుటి వారు ఎలా భావిస్తారన్న విషయం తెలుసుకోవాలని అన్నారు.
మోకాళ్లను చూపుతూ ఉండే జీన్స్ ధరించడం పాశ్చాత్య సంస్కృతి ప్రభావమే అన్నారు. పాశ్చాత్యులు మనల్ని అనుసరిస్తూ యోగా చేస్తూ, పూర్తిగా శరీరాన్ని కప్పేసే వస్త్రాలను వేసుకుంటుంటే.. మనం మాత్రం నగ్నత్వం వైపు పరుగులు తీస్తున్నామని ఉత్తరాఖండ్ సీఎం తీరథ్‌సింగ్ రావత్ కాంట్రవర్సీ స్టేట్‌మెంట్స్ చేశారు. ఈ పోకడలు లైంగిక వేధింపులు వైపు మళ్లే ప్రమాదం ఉందన్నారు. యువతులు చిరిగిన జీన్స్ వేసుకోవడం తప్పు అన్నట్టు సీఎం చేసిన కామెంట్లపై మహిళా లోకం భగ్గుమంటోంది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది.