ట్రయాంగిల్ లవ్.. అబ్బాయి కోసం రోడ్డుపై కొట్టుకున్న అమ్మాయిలు

Controversy broke out between groups of girls in love triangle. అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాల విషయంలో అబ్బాయిలు గ్రూపులుగా ఏర్పడి కొట్టుకునే

By Medi Samrat
Published on : 18 Nov 2021 11:49 AM IST

ట్రయాంగిల్ లవ్.. అబ్బాయి కోసం రోడ్డుపై కొట్టుకున్న అమ్మాయిలు

అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాల విషయంలో అబ్బాయిలు గ్రూపులుగా ఏర్పడి కొట్టుకునే ఘటనలు చాలానే చూశాం.. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో అమ్మాయిలు కొట్టుకున్న ఘటన వైరల్‌గా మారింది. ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమించారు. ఆ విషయంలో మొదలైన గొడవ.. చివరికి నడిరోడ్డుపై కొట్టుకోవడం దాకా వెళ్ళింది. ఇరువైపుల గ్రూప్ లలో ఉన్న అమ్మాయిలు ఒకరినొకరు దుర్భాషలాడుకోవడం జరిగింది. అంబికాపూర్‌లో ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపై కొట్టుకున్నారు.

దీంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో, స్థానికులు జోక్యం చేసుకుని రెండు గ్రూపులను విడిపించారు. బరంపారా రోడ్డు మధ్యలో ఈ గొడవ జరగడంతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైందని తెలుస్తోంది. రెండు గ్రూపుల అమ్మాయిల మధ్య గొడవకు ట్రయాంగిల్ లవ్ స్టోరీనే కారణం అని చెబుతున్నారు. బరంపారాలో నివసించే అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తోందని.. శక్తి పారాకు చెందిన ఇంకొక అమ్మాయి కూడా అదే అబ్బాయి పట్ల ఆకర్షితురాలైంది. ఈ విషయం తెలియగానే ఇద్దరు అమ్మాయిలు రెచ్చిపోయి గొడవకు దిగారు. ఆ అమ్మాయి ఫ్రెండ్స్.. ఈ అమ్మాయి ఫ్రెండ్స్ కలిసి ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు.


Next Story