కల్లు తాగండి.. కరోనాను పోగొట్టుకోండి అంటున్న పొలిటీషియన్
Consuming farm liquor 'taadi' can prevent from catching Covid. కరోనా మహమ్మారి.. ఈ మహమ్మారి మొదలైన సమయంలో ఎన్నో
By Medi Samrat Published on 23 Dec 2020 12:20 PM GMTకరోనా మహమ్మారి.. ఈ మహమ్మారి మొదలైన సమయంలో ఎన్నో అపోహలను, అవాస్తవాలను ప్రచారం చేశారు. వాటిలో చాలా వరకూ నిజం లేదని వైద్యులు, మీడియా సంస్థలు తేలుస్తూనే ఉన్నాయి. కానీ కొందరు మాత్రం ఇష్టం వచ్చినట్లుగా టిప్స్ ఇస్తూనే ఉన్నారు. ఏది పడితే అది తినండి.. అది తాగండి అంటూ ఉచిత సలహాలు ఇస్తూ ఉన్నారు. ఇలాంటి ఉచిత సలహాల వలన ప్రజల ప్రాణాలకే ప్రమాదం.
తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) నేత ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కల్లు తాగి కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీ ఉత్తరప్రదేశ్ విభాగం అధ్యక్షుడైన భీమ్ రాజ్‌భర్ బల్లియా జిల్లా రాస్రాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. కల్లుకు రోగ నిరోధక శక్తి ఉందని, ఇది గంగానది కంటే స్వచ్ఛమైనదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్లును ఎక్కువగా తాగడం వల్ల కరోనా నుంచి దూరంగా ఉండొచ్చని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్‌భర్ సమాజంలో పిల్లలు కూడా కల్లు తాగుతారట.. కల్లు తాగితే కొవిడ్ నుంచి బయటపడవచ్చని చెప్పారు. ఇలా ఇష్టమొచ్చినట్లు నాయకులు కరోనా మహమ్మారికి సంబంధించిన ఫ్రీ టిప్స్ ఇస్తూ ఉన్నారు. ఇలాంటి వాటి వలన ప్రజల ప్రాణాలకే ప్రమాదం.
గతంలో కూడా కరోనా వైరస్ బారి నుండి తప్పించుకోవాలంటే ఆల్కహాల్ ను స్వీకరించాలి అన్న వార్తను చాలా మంది నమ్మారు ఇరాన్ లో..! 700 మందికి పైగా కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఏది పడితే అది మాట్లాడితే మాత్రం ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది.