నిండు గర్బిణి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్..!

Constable saves pregnant woman. ముంబైలోని కల్యాణ్‌ రైల్వే స్టేషన్‌లో ఓ నిండు గర్భిణికి పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్‌ నుంచి కదులుతున్న

By అంజి  Published on  19 Oct 2021 2:45 AM GMT
నిండు గర్బిణి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్..!

ముంబైలోని కల్యాణ్‌ రైల్వే స్టేషన్‌లో ఓ నిండు గర్భిణికి పెను ప్రమాదం తప్పింది. రైల్వే స్టేషన్‌ నుంచి కదులుతున్న రైలు నుండి గర్భిణి కిందకి దిగుతుండగా.. రైల్వే కానిస్టేబుల్‌ ఆమె చేయి పట్టుకుని లాగి గర్భిణి ప్రాణాలు కాపాడాడు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్‌ అప్రమత్తతో వ్యవహారించడంతో ప్రమాదం తప్పింది. కదులుతున్న రైలు నుండి గర్భిణి దిగుతుండగా.. వెంటనే ఆమెను చేయి పట్టి ఫ్లాట్‌ ఫామ్‌ మీదకు లాగాడు కానిస్టేబుల్‌. లేదంటో రైలు, ఫ్లాట్‌ ఫాం మధ్యలో పడి గర్భిణి ప్రాణాలు కోల్పోయేది. గర్బిణితో ఉన్న మరో వ్యక్తి కూడా రైలులో నుంచి ఫ్లాట్‌ఫాం మీదకు దూకాడు. అతని ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో గర్బిణి ప్రాణాలు కాపాడిన రైల్వే కానిస్టేబుల్‌ ప్రశంసలు అందుకుంటున్నారు. రైల్వే కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.

అయితే గతంలో కూడా కదులుతున్న రైలు నుండి దిగేందుకు ప్రయత్నిస్తూ జారిపడిన ఘటనలు ఎన్నో జరిగాయి. కొన్ని ఘటనల్లో కొందరు మరణించగా, మరికొందరు రక్షించబడ్డారు. ముఖ్యంగా రైలు ఎక్కి, దిగే సమయాల్లో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని రైల్వే అధికారులు చెప్తున్నారు.

Next Story
Share it