ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధించండి : హైకోర్టు
Consider holding virtual rallies amid COVID-19 surge. కోవిడ్-19 థర్డ్ వేవ్ దేశాన్ని తాకడంతో ఉత్తరాఖండ్ హైకోర్టు బుధవారం ఎన్నికల కమిషన్‌ను
By Medi Samrat Published on 6 Jan 2022 5:04 AM GMTకోవిడ్-19 థర్డ్ వేవ్ దేశాన్ని తాకడంతో ఉత్తరాఖండ్ హైకోర్టు బుధవారం ఎన్నికల కమిషన్‌ను ఎలక్షన్ ర్యాలీలను నిషేధించాలని కోరింది. అలాగే.. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వర్చువల్ పోల్ ర్యాలీలను మాత్రమే అనుమతించాలని కోరింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లో ఈ ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అలాగే దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నందున. ఉత్తరాఖండ్‌లో భారీ బహిరంగ సభలను నిషేధించడాన్ని పరిశీలించాలని న్యాయమూర్తులు సంజయ్ కుమార్ మిశ్రా, అలోక్ కుమార్ వర్మలతో కూడిన డివిజన్ బెంచ్.. పోల్ ప్యానెల్‌ను కోరింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ న్యాయవాది శివ్‌భట్ దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ విధంగా స్పందించింది.
ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా COVID-19 కేసులు పెరుగుతూనే ఉన్నందున, మహమ్మారిని అరికట్టడానికి అనేక రాష్ట్రాలు పరిమితులు, వారాంతపు, రాత్రి కర్ఫ్యూలను ప్రకటించాయి. అయితే ఉత్తరాఖండ్, యూపీ, పంజాబ్, గోవా, మణిపూర్‌లలో రాజకీయ పార్టీలు నిర్వహించిన ఎన్నికల ర్యాలీలకు జనం భారీగా తరలివచ్చారు. కోవిడ్ థర్డ్ వేవ్ ఇప్పటికే దేశాన్ని తాకిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా చాలా మంది స్వరాలు లేవనెత్తారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, అనుప్ చంద్ర పాండేతో కలిసి ఐదు రాష్ట్రాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధత విషయమై ఇప్పటికే సమీక్షించారు. ఎన్నికలు తమ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా లేదా కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా వేయబడతాయా అనేది పోల్ ప్యానెల్ ఇంకా ప్రకటించలేదు. ఇదే సమయంలో పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలో దూకుడుగా ప్రచారం చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జనవరి 4న కోవిడ్ బారిన పడిన విషయాన్ని గమనించాలి.