ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.60 కోట్లు ఇచ్చానని ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ మంగళవారం ఆరోపించాడు. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ఉన్నతస్థాయి కమిటీ సుకేష్ వాంగ్మూలాన్ని స్వీకరించిందని, విచారణ జరిపించాలని సుకేష్ చంద్రశేఖర్ న్యాయవాది అనంత్ మాలిక్ మీడియాకు తెలిపారు. సుకేష్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.. అతడు కోర్టుకు హాజరయ్యాడు.
ఉన్నత స్థాయి వ్యక్తులు, ప్రముఖుల నుండి డబ్బు వసూలు చేసిన ఆరోపణలపై ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నాడు సుకేష్. అంతకుముందు, అతను తీహార్ జైలులో ఉంచారు. అయితే చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని.. తన జైలును మార్చాలని పదేపదే అభ్యర్థనలు రావడంతో అధికారులు వేరే జైలుకు తరలించారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు సుకేష్ రాసిన లేఖలో, జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంత్రి సత్యేందర్ జైన్‌కు రూ. 10 కోట్లు చెల్లించానని, తనను జైలులో వేధించారని, బెదిరించారని పేర్కొన్నాడు. ఆప్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశాడు సుకేష్.