ఉగ్రదాడిపై మోడీ అఖిలపక్ష భేటీ నిర్వహించాలి..కాంగ్రెస్ తీర్మానం

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం అయింది.

By Knakam Karthik
Published on : 24 April 2025 2:00 PM IST

National News, Congress Working Committee, Pm Modi, Jammu Kashmir, Terror Attack

ఉగ్రదాడిపై మోడీ అఖిలపక్ష భేటీ నిర్వహించాలి..కాంగ్రెస్ తీర్మానం

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జరిగిన ఈ సమావేశానికి సోనియగాంధీ, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ మీటింగ్‌లో సీడబ్ల్యూసీ కొన్ని తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఈ దాడిని పాకిస్తాన్ మద్దతుతో సుదీర్ఘంగా పన్నిన కుట్రగా అభివర్ణించింది. ఇది భారత ప్రజాస్వామ్య విలువలపై నేరుగా దాడి అని పేర్కొంది. దాడికి ప్రతిగా ఉద్రిక్తతలు రాకుండా ఉండేందుకు ప్రజలను శాంతి పాటించమని కోరింది.

కాగా ఉగ్ర దాడిపై ప్రధాని మోడీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. కేంద్ర హోంశాఖ నేరుగా పర్యవేక్షించే కేంద్ర పాలిత ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం భద్రతా లోపం వల్లే ఈ దాడి జరిగిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. దీనిపై లోతైన పరిశీలన జరగాలని డిమాండ్ చేసింది. రాబోయే అమర్‌నాథ్ యాత్రలో భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని, భద్రతా ఏర్పాట్లు పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండాలని కోరింది. టూరిజంపై ఆధారపడి జీవించే స్థానిక ప్రజల జీవనోపాధిని పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

Next Story