150 సీట్లు గెలుస్తాం : రాహుల్ గాంధీ

Congress to get 150 seats in Madhya Pradesh. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 150 సీట్లు గెలుచుకుంటుందని

By Medi Samrat  Published on  29 May 2023 12:31 PM GMT
150 సీట్లు గెలుస్తాం : రాహుల్ గాంధీ

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 150 సీట్లు గెలుచుకుంటుందని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సోమవారం ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎన్నికల సన్నద్ధతపై సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో తమ పార్టీ విజయం సాధించిందని.. అదే ఊపులో మధ్యప్రదేశ్‌లో కూడా తమ పార్టీ విజయాన్ని అందుకుంటుందని అన్నారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మధ్యప్రదేశ్‌కు చెందిన పార్టీ అగ్రనేతల సమావేశమయ్యారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 సీట్లు ఉన్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 స్థానాలకుగాను తమ పార్టీ 136 స్థానాలు గెలిచిందని, ఇప్పుడు ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు పునరావృతమవుతాయని రాహుల్‌ ధీమా వ్యక్తంచేశారు.


Next Story