రామ మందిర ప్రారంభోత్సవానికి రావట్లేదు

అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ, ఆరెస్సెస్‌లు తమ సొంత కార్యక్రమంగా భావిస్తున్నారని.. అందుకే కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తేల్చి చెప్పింది.

By Medi Samrat  Published on  10 Jan 2024 9:00 PM IST
రామ మందిర ప్రారంభోత్సవానికి రావట్లేదు

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ వెళ్లడం లేదు. ఈ అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ, ఆరెస్సెస్‌లు తమ సొంత కార్యక్రమంగా భావిస్తున్నారని.. అందుకే కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తేల్చి చెప్పింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశంలోని ప్రముఖులు, రాజకీయ నేతలకు ఆహ్వానాలు పంపించింది. అందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేతలకు కూడా ఆహ్వాన పత్రికలను పంపింది.

జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి సహా సీనియర్‌ నేతలు హాజరుకావడం లేదని పార్టీ ప్రకటనలో తెలిపారు. జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభించనున్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ఇతరులతో సహా 6,000 మందికి పైగా 'ప్రాణ్ ప్రతిష్ట' కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు.

Next Story