కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కౌంటింగ్ అక్టోబర్ 19న జరగనుంది. ఏఐసీసీ తదుపరి అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్‌ను ఆమోదించేందుకు పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆదివారం సమావేశమైంది.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూల్ ఇక్కడ ఉంది:
సెప్టెంబర్ 22: నోటిఫికేషన్ జారీ చేయబడుతుంది
సెప్టెంబర్ 24-సెప్టెంబర్ 30: నామినేషన్ దాఖలు తేదీ
అక్టోబర్ 1: నామినేషన్ల పరిశీలన తేదీ
అక్టోబర్ 8: ఉపసంహరణకు చివరి తేధి
అక్టోబర్ 17: ఎన్నికలు జరుగు తేధి
అక్టోబర్ 19 : కౌంటింగ్ తేదీ, ఆ రోజే ఫలితాల ప్రకటన కూడా ఉండే అవకాశం
ఈ ఏడాది ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 20 మధ్య కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందని గత ఏడాది అక్టోబర్‌లో కాంగ్రెస్ ప్రకటించింది. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండో సారి ఓటమిని చవిచూడడంతో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
తాత్కాలిక అధ్యక్షురాలిగా మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టిన సోనియా గాంధీ.. G-23 నాయకుల బహిరంగ తిరుగుబాటు తర్వాత 2020 ఆగస్టులో నిష్క్రమించాలని అనుకుంది. అయితే CWC మాత్రం ఆమెను కొనసాగించాలని కోరింది.