ఢిల్లీ: రూపాయి విలువ 90 రూపాయల మార్క్‌ను దాటిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా, రూపాయి పతనం దేశ ఆర్థిక పరిస్థితి అసలు స్థితిని బయటపెడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
“మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు సరిగా ఉంటే రూపాయి ఈ స్థాయికి పడిపోదు,” అని ఖర్గే విమర్శించారు. 2014కు ముందు నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యను గుర్తుచేసిన ఖర్గే, “హిందూస్తాన్ రూపాయి ఎందుకు బలహీనపడుతోంది? దానికి జవాబు చెప్పాలి, దేశం ప్రశ్నిస్తోంది” అని మోదీ అప్పట్లో చెప్పారని గుర్తు చేశారు. “ఈరోజు మేము అదే ప్రశ్నను మోదీగారిని అడుగుతున్నాం. ఆయన దేశానికి జవాబు ఇవ్వాల్సిందే,” అని ఖర్గే అన్నారు.