పిల్లలు అన్నప్పుడు తాగుతారు.. అంత మాత్రానికే అరెస్ట్‌ చేస్తారా.?

Congress mla meena kanwar viral comments. రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మీనా కన్వర్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతోన్నాయి. పిల్లలన్నప్పుడు

By అంజి  Published on  19 Oct 2021 10:25 AM GMT
పిల్లలు అన్నప్పుడు తాగుతారు.. అంత మాత్రానికే అరెస్ట్‌ చేస్తారా.?

రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మీనా కన్వర్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతోన్నాయి. పిల్లలన్నప్పుడు తాగాతారు.. అంత మాత్రానికే అరెస్ట్‌ చేస్తారా? అంటూ కన్వర్‌ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. ఆదివారం రాత్రి జోధ్‌పూర్‌ పోలీసులు డ్రంకన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో తాగి వాహనాలు నడుపుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాగి పట్టుబడిన వారిలో రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మీనా కన్వర్‌ మేనల్లుడు కూడా ఉన్నాడు. వారందరిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అల్లుడు అరెస్ట్‌ అయిన విషయం తెలుసుకున్న మీనా కన్వర్‌ వెంటనే తన భర్త, అనుచరులతో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది.

అక్కడున్న పోలీసులతో వాగ్వాదానికి దిగింది. తన మేనల్లుడిని విడిచి పెట్టాలని స్టేషన్‌లో బైఠాయించి ధర్నాకు దిగింది. పిల్లలన్నప్పుడు తాగుతారని, అందరి పిల్లలు తాగుతారని, అంతమాత్రానికే అరెస్ట్‌ చేస్తారా..? అంటూ ఎమ్మెల్యే మీనా కన్వర్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. తన మేనల్లుడిని వదలిపెట్టకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే కింద కూర్చుంటే... నువ్వు కుర్చీలో ఎలా కూర్చుంటావు అంటూ మీనా కన్వర్ భర్త ఉమ్మెద్‌ సింగ్ రాథోడ్‌ ఎస్సైతో వాదనకు దిగాడు.

Next Story
Share it