రాహుల్ గాంధీకి శిక్ష విధించిన న్యాయమూర్తిని బెదిరించిన కాంగ్రెస్ నేత

Congress leader threatens judge who sentenced Rahul Gandhi. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష

By Medi Samrat  Published on  7 April 2023 8:15 PM IST
రాహుల్ గాంధీకి శిక్ష విధించిన న్యాయమూర్తిని బెదిరించిన కాంగ్రెస్ నేత

Rahul Gandhi


కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి నాలుక నరికివేస్తానని తమిళనాడుకు చెందిన‌ ఆ పార్టీ నాయకుడు బెదిరించాడు. ఆ వ్యాఖ్యలపై కేసు నమోదైంది. మణికందన్ తమిళనాడులోని దిండిగల్ కు చెందిన‌ కాంగ్రెస్ నాయకుడు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌లోని ఎస్సీ, ఎస్టీ విభాగం నిరసన వ్యక్తం చేసింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. “మార్చి 23న, సూరత్ కోర్టు న్యాయమూర్తి మా నాయకుడు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించారు. జస్టిస్ హెచ్ వర్మ వినండి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మీ నాలుక నరికేస్తాం’’ అని మణికందన్ బెదిరింపు వ్యాఖ్య‌లు చేశాడు. మణికందన్‌పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు దిండిగల్ పోలీసులు.

మోదీ ఇంటిపేరు వ్యాఖ్యల‌పై 2019లో న‌మోదైన‌ క్రిమినల్ పరువు నష్టం కేసులో గత నెలలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దోషిగా నిర్ధారించబడ్డారు. అతనికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దోషిగా తేలడంతో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యునిగా అనర్హత వేటు పడింది. ఈ ఘ‌ట‌న‌ను ప్రతిపక్షాలు ఖండించాయి. అనేక పార్టీలు రాహుల్‌ గాంధీకి మద్దతుగా నిలిచాయి. రాహుల్‌ ని దోషిగా నిర్ధారించి, పార్లమెంటుకు అనర్హుడిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కూడా దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తోంది.



Next Story