కాంగ్రెస్ సభలో ఆ హీరో ప్ర‌త్య‌క్షం..!

Congress leader Rahul Gandhi with actor Shiva Rajkumar. సీనియర్ హీరో శివరాజ్ కుమార్ కాంగ్రెస్ సభలో దర్శనమిచ్చారు.

By Medi Samrat  Published on  2 May 2023 7:45 PM IST
కాంగ్రెస్ సభలో ఆ హీరో ప్ర‌త్య‌క్షం..!

Congress leader Rahul Gandhi with actor Shiva Rajkumar


సీనియర్ హీరో శివరాజ్ కుమార్ కాంగ్రెస్ సభలో దర్శనమిచ్చారు. చిత్ర‌దుర్గ‌లో మంగ‌ళ‌వారం నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో శివ రాజ్‌కుమార్ పాల్గొన్నారు. తాను రాహుల్ గాంధీ అభిమానిగా ఈరోజు ఇక్క‌డ‌కి వ‌చ్చాన‌ని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ ఇటీవ‌ల భార‌త్ జోడో యాత్ర‌తో దేశ‌వ్యాప్తంగా పాద‌యాత్ర చేప‌ట్టార‌ని, ఈ యాత్ర త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌ని అన్నారు.

శివరాజ్ కుమార్ భార్య గీత మూడు రోజుల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరారు. గీతా రాజ్ కుమార్ సోదరుడు మధు బంగారప్ప ప్రస్తుతం సోరబ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీజేపీ తరఫున వీరి సోదరుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే కుమార్ బంగారప్ప బరిలో నిలిచారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సారెకొప్ప బంగారప్ప పిల్లలు. ఇక బీజేపీ తరఫున చాలా రోజులుగా ప్రముఖ హీరో కిచ్చా సుదీప ప్రచారం చేస్తున్నారు.


Next Story