కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తన బుక్ లో హిందుత్వాన్ని అత్యంత వివాదాస్పద అంశాలతో పోల్చారు. అయోధ్యపై ఆయన రాసిన కొత్త పుస్తకంలో సల్మాన్ ఖుర్షీద్ "హిందుత్వ"ను రాడికల్ ఇస్లామిక్ టెర్రర్ గ్రూపులతో పోల్చారని ఆరోపిస్తూ ఢిల్లీకి చెందిన ఒక న్యాయవాది అతనిపై ఫిర్యాదు చేశారు. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ముస్లిం ఓట్లను పొందేందుకు కాంగ్రెస్ 'మత రాజకీయాలు' ఆడుతోందని ఆరోపిస్తూ బీజేపీ కూడా కాంగ్రెస్‌ను టార్గెట్ చేసింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హిందువులను గౌరవిస్తే సల్మాన్ ఖుర్షీద్‌ను కాంగ్రెస్ నుండి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
హిందుత్వను రాడికల్ జిహాదీ గ్రూప్‌లైన ఐఎస్ఐఎస్, బోకా హరామ్‌లతో సల్మాన్ ఖుర్షీద్ తన కొత్త పుస్తకంలో పోల్చడంపై బీజేపీ మండిపడింది. ఇస్లామిక్ జీహాద్‌తో హిందుత్వను ముండిపెట్టడం వెనుక ముస్లిం ఓట్లకు గాలం వేసే ఆలోచన గ్రాండ్ ఓల్డ్ పార్టీ (కాంగ్రెస్)కి ఉందని బీజేపీ సీనియర్ నేత, ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తప్పుపట్టారు.సఫ్రాన్ టెర్రర్, ఇస్లామిక్ జీహాద్ ఒకటేననడం ముస్లిం ఓట్లను పొందేందుకు కాకపోతే మరింకెందుకని అనుకోగలమని మాలవీయ ఒక ట్వీట్‌లో ప్రశ్నించారు. ''సన్ రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్'' అనే పేరుతో సల్మాన్ ఖాన్ రచించిన తాజా పుస్తకాన్ని ఢిల్లీలో బుధవారం ఆవిష్కరించారు. ఈ పుస్తకంలోనే 113వ పేజీలో ఆయన హిందుత్వను ఐఎస్ఐఎస్, బొకో హరామ్‌తో పోల్చారు.