డిసెంబర్ 1న కాంగ్రెస్ 'చలో ఢిల్లీ'

డిసెంబర్ 1న సేవ్ డెమోక్రసీ పేరుతో కార్యక్రమం చేప‌ట్ట‌నున్న‌ట్లు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ వీ హనుమంతరావు తెలిపారు.

By Kalasani Durgapraveen  Published on  26 Nov 2024 1:28 PM IST
డిసెంబర్ 1న కాంగ్రెస్ చలో ఢిల్లీ

డిసెంబర్ 1న సేవ్ డెమోక్రసీ పేరుతో కార్యక్రమం చేప‌ట్ట‌నున్న‌ట్లు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ వీ హనుమంతరావు తెలిపారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారన్నారు. రాజ్యాంగం కాపాడి దళిత, ఆదివాసీ, మైనార్టీలకు న్యాయం జరగాలని చలో ఢిల్లీ కార్యక్రమం చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. రామ్ లీలా మైదానంలో సేవ్ డేమోక్రసీ జరుగుతుందన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను కాపాడాలని చలో ఢిల్లీ చేప‌ట్టామ‌న్నారు. ఉన్నవారికే కాదు లేనివారికి కూడా సామాజిక ఆర్థిక న్యాయం జరగాలని రాహుల్ గాంధీ అనుకుంటున్నార‌ని తెలిపారు. నరేంద్ర మోదీ కార్పోరేట్ సంస్థలకు లబ్ది చేకూరుస్తున్నార‌ని ఆరోపించారు.

Next Story