ఢిల్లీలో బీజేపీకి బీ టీమ్‌లా కాంగ్రెస్‌ పనిచేసింది..రాహుల్‌పై మాయావతి ఫైర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర విమర్శలు చేశారు.

By Knakam Karthik
Published on : 21 Feb 2025 1:23 PM IST

National News, Bsp Chief Mayawati, RahulGandi, Delhi Assembly, Bjp, Congress

ఢిల్లీలో బీజేపీకి బీ టీమ్‌లా కాంగ్రెస్‌ పనిచేసింది..రాహుల్‌పై మాయావతి ఫైర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బీ టీమ్‌లా కాంగ్రెస్ వ్యవహరించిందని.. దాని వల్లే ఢిల్లీలో బీజేపీ గెలిచినట్లు మాయవతి పేర్కొన్నారు. అయితే ఎన్నికల సమయంలో ఇండియా కూటమికి బీఎస్పీ మద్దతు ఇవ్వలేదని.. ఇది నిరుత్సాహానికి గురిచేసినట్లు ఇటీవల రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బెహన్ జీ తమతో కలిసి పని చేస్తే.. బీజేపీ నెగ్గేది కాదన్నారు. రాహుల్ చేసిన ఆరోపణలకు మాయావతి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆమె ఎక్స్ అకౌంట్ వేదికగా పోస్టు చేశారు.

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి బీ టీమ్‌లా కాంగ్రెస్ పని చేసిందన్న విషయం అందరికీ తెలుసు అని.. దాని వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చినట్లు ఆమె ఆ పోస్టులో రాసుకొచ్చారు. అందుకే కాంగ్రెస్ పార్టీ దారుణమైన పరిస్థితిలో ఉందని.. కనీసం ఆ పార్టీ అభ్యర్థులకు చాలా చోట్ల డిపాజిట్ కూడా దక్కలేదని ఆమె తెలిపారు. ఇతరుపట్ల పట్ల వేలు పెట్టి చూపే ముందు.. తమ స్వంత వ్యవహారాల గురించి సమీక్ష చేసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్‌కు మాయావతి సూచన చేశారు. ఢిల్లీలో ఏర్ప‌డిన బీజేపీ స‌ర్కారుకు ఎన్నిక‌ల వాగ్దానాల‌ను అమ‌లు చేయ‌డం పెను స‌వాల్‌గా మార‌నున్న‌ట్లు మాయావ‌తి ఆరోపించారు.

Next Story