చంద్రయాన్‌ - 2 వ్యోమనౌకు భారీ ప్రమాదం.. క్యామ్‌ విన్యాసం చేపట్టిన ఇస్రో.!

Collision avoidance manoeuvre performed for Chandrayaan-2 . 2019లో విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్‌కు చెందిన వ్యోమనౌక, NASAకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (LRO) ఒకదానికొకటి ఢీ కొట్టుకో పోయాయి.

By అంజి  Published on  18 Nov 2021 7:39 AM GMT
చంద్రయాన్‌ - 2 వ్యోమనౌకు భారీ ప్రమాదం.. క్యామ్‌ విన్యాసం చేపట్టిన ఇస్రో.!

2019లో విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్‌కు చెందిన వ్యోమనౌక, NASAకు చెందిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (LRO) ఒకదానికొకటి ఢీ కొట్టుకో పోయాయి. అయితే ఈ ప్రమాదాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తప్పించింది. కొలిజన్‌ అవాయిడెన్స్‌ మెనూవర్‌ విన్యాసం ద్వారా ఈ ప్రమాదం నుండి గట్టెక్కినట్లు ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. చంద్రుడి ఉత్తర ధ్రువానికి సమీపంలో చంద్రయాన్‌-2 వ్యోమనౌక, లునార్‌ రికనైసెన్స్‌ ఆర్బిటర్‌ రెండూ కూడా అక్టోబర్‌ 20వ తేదీన ప్రమాదకర పరిస్థితిలో ఒకదానికొకటి దగ్గరికి రానున్నట్లు శాస్త్రవేత్తలు ముందే అంచనా వేశారు.

ఓ సమయంలో వాటి మధ్య రేడియల్‌ వేర్పాటు దూరం 100 మీటర్ల కంటే తక్కువగా ఉంటుందని గుర్తించారు. అవి ఒకదానికొకటి ఢీకొట్టకుండా ఉండేందుకు కొలిజన్‌ అవాయిడెన్స్‌ మెనూవర్‌ విన్యాసం చేపట్టాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇరు సంస్థల అంగీకారం మేరకు గత నెల 18వ తేదీన క్యామ్‌ విన్యాసాన్ని చేపట్టారు. దీంతో ప్రమాదాన్ని తప్పించారు. అంతరిక్షంలోని వస్తువులు, వ్యర్థాతో ఢీ కొట్టే ముప్పును తొలగించేందుకు ఈ విన్యాసాన్ని చేపడతారు.

ఇక భూ కక్ష్యలోని శాటిలైట్‌లకు క్యామ్‌ విన్యాసం చేపట్టడం మూములేనని ఇస్రో పేర్కొంది. చంద్రయాన్ వ్యోమనౌకకు ఇలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి అని, భవిష్యత్‌లో రెండింటి మధ్య దూరం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని ఇస్రో తెలిపింది.

Next Story