కారు డ్రైవర్‌తో ప్రేమలో పడ్డ యువతి.. అసలు ట్విస్ట్‌ అదే.!

Collage student marries her family car driver in karnataka. ఓ ఇంట్లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తి.. యజమాని కూతురిని రోజు కాలేజీకి కారులో తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో వారి

By అంజి  Published on  21 Feb 2022 12:05 PM IST
కారు డ్రైవర్‌తో ప్రేమలో పడ్డ యువతి.. అసలు ట్విస్ట్‌ అదే.!

ఓ ఇంట్లో కారు డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తి.. యజమాని కూతురిని రోజు కాలేజీకి కారులో తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం పెరిగింది. దీంతో యువతిని ప్రేమ పేరుతో కారు డ్రైవర్‌ నమ్మించాడు. అతని మాటలు నమ్మి ప్రేమలో పడ్డ ఆ యువతి కారు డ్రైవర్‌ను పెళ్లి చేసుకుంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా జాలగేరి గ్రామంలో చోటు చేసుకుంది. సోమలింగ అనే వ్యక్తికి పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు ఓ కుటుంబం దగ్గర కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే యాజమాని కూతురిని ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తన వలలో వేసుకున్నాడు. యువతి బీకాం పూర్తి చేసింది. మేజర్‌ కావడంతో ఇద్దరు ఇంటి నుండి పారిపోయారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని రిజిస్ట్రార్‌ ఆఫీసులో తమ పేర్లు నమోదు చేయించుకున్నారు.

కూతురు కనబడకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెళ్లైన వ్యక్తితో మళ్లీ పెళ్లేంటని యువతిని కుటుంబ సభ్యులు నిలదీశారు. డ్రైవర్‌పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే యువతి మాత్రం తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న సోమలింగతోనే తన జీవతం అని కుండబద్దలు కొట్టింది. పైగా సోమలింగకు పెళ్లి అయ్యిందని తనకు తెలుసునని, మొదటి భార్యతో, వారి పిల్లలతో అన్యోన్యంగా కలిసి ఉంటానని యువతి చెప్పడం అందరినీ షాక్‌కి గురి చేసింది. ఆదివారం నాడు సదరు యువతి విజయపుర జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్లి.. తన కుటుంబం నుండి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Next Story