మన చమురు కొనుగోళ్లకు అమెరికా అనుమతి ఏంటి?..కేంద్రంపై సీఎం స్టాలిన్ ఘాటు విమర్శలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు
By - Knakam Karthik |
మన చమురు కొనుగోళ్లకు అమెరికా అనుమతి ఏంటి?..కేంద్రంపై సీఎం స్టాలిన్ ఘాటు విమర్శలు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు అమెరికా కేవలం 30 రోజుల గడువు ఇవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మన దేశ ఇంధన అవసరాల కోసం మరొక దేశం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.
అలాగే, విశాఖపట్నంలో భారత్ నిర్వహించిన అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్న ఇరాన్ నౌక 'IRIS Dena'ను అమెరికా ముంచివేయడంపై కేంద్రం మౌనంగా ఉండటం సరికాదన్నారు. అతిథిగా వచ్చిన నౌకకు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు భారత్ నిష్క్రియగా ఉండకూడదని పేర్కొన్నారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని, స్వతంత్ర విదేశీ విధానాన్ని పూర్తిగా పక్కనపెట్టేసిందని, అంతర్జాతీయ స్థాయిలో దేశ గౌరవాన్ని, సార్వభౌమాధికారాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని స్టాలిన్ స్పష్టం చేశారు.
When the United States decides to allow India to purchase Russian oil for just 30 days, it raises a fundamental question. Why should India need another country’s approval to secure its own energy needs?Equally troubling is the sinking of the unarmed Iranian warship IRIS Dena by…
— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) March 6, 2026