మహారాష్ట్ర కాందార్ లోహలో జరిగిన బీఆర్‌ఎస్ పబ్లిక్ మీటింగ్‌లో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు జన్మనిచ్చిన మరాఠా పుణ్యభూమికి ప్రణామం. పార్టీలో చేరుతున్న నేతలకు హృదయపూర్వక స్వాగతం.' అని కేసీఆర్ అన్నారు. దేశంలో త్వరలో తుఫాన్ రాబోతోందని అన్నారు. దాన్నెవరూ ఆపలేరని చెప్పుకొచ్చారు. కేసీఆర్‌కు ఇక్కడేం పని అని మాజీ సీఎం ఫడ్నవీస్ అంటున్నారని, భారత పౌరుడిగా ప్రతీ రాష్ట్రానికి వెళ్తానన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాం.. తెలంగాణ తరహా అభివృద్ధి ఫడ్నవీస్ చేస్తే నేను మహారాష్ట్ర రానని ప్రకటిస్తున్నానన్నారు. తెలంగాణ తరహా పథకాలు మహారాష్ట్రలో అమలు చేయనంత వరకు నేను వస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మహారాష్ట్రలోనూ దళితబంధు అమలు చేస్తే రానని అన్నారు. మహారాష్ట్ర రైతుల సమస్యలు పరిష్కరిస్తే తాను మహారాష్ట్ర రానని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలతో పేదల బతుకులు మారలేదని కేసీఆర్ అన్నారు.
ఎంత మంది పాలకులు మారినా ప్రజల తలరాతలు మారలేదని.. నేతలు తలచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చన్నారు కేసీఆర్. మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో సమృద్ధిగా సహజ వనరులున్నాయి. దేశంలో 360 బిలియన్ టన్నుల బొగ్గు ఉంది. దేశంలో ఉన్న బొగ్గుతో 24 గంటలు సులభంగా విద్యుత్ సులభంగా ఇవ్వొచ్చని కేసీఆర్ చెప్పుకొచ్చారు. 125 ఏళ్ల పాటు విద్యుత్ ఇచ్చేంత బొగ్గు మన దగ్గర ఉన్నా ఎందుకు విద్యుత్ ఇవ్వలేకపోతున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. రైతుల బతుకులు మారే వరకూ పోరాడుతూనే ఉంటామని కేసీఆర్ అన్నారు.