31న సీఎం కేసీఆర్ బీహార్ పర్యటన
CM KCR to visit Bihar. గాల్వాన్ లోయలో ప్రాణాలు అర్పించిన భారత జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం
By Medi Samrat Published on 29 Aug 2022 3:30 PM GMTగాల్వాన్ లోయలో ప్రాణాలు అర్పించిన భారత జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆగస్టు 31న బీహార్‌లో పర్యటించనున్నారు. వ్యవసాయ చట్టాల ఆందోళనలో తమ ప్రాణాలను త్యాగం చేసిన రైతులకు, గాల్వాన్ వ్యాలీలో తమ ప్రాణాలను బలిగొన్న సైనికులకు కూడా ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు ఓ ప్రకటన తెలిపారు.
కేసీఆర్ బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి పాట్నా వెళ్లనున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి అమరులైన సైనికుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. సికింద్రాబాద్ టింబర్ డిపోలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్ కార్మికుల కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం అందించనున్నారు. ఒక్కో సైనికుడి కుటుంబానికి రూ.10 లక్షలు, మరణించిన వలస కార్మికులకు రూ.5 లక్షల చొప్పున చెక్కులను అందజేయనున్నారు.
బీహార్ సీఎం, జనతాదళ్ యూ అధినేత నితీష్ కుమార్.. కేసీఆర్‌ను భోజనానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో రాజకీయాలు కూడా చర్చకు రావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ భేటీలో బీహార్ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి, జెడి (యు), ఆర్‌జెడి నాయకులు పాల్గొంటారని సమాచారం.