భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమావేశం ముగిసింది. ప్రధానితో నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు ఒక గంటా.. 20 నిమిషాలకు పైగా సాగింది. ప్రధాని మోదీతో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు పోలవరం ప్రాజెక్టుకు తక్షణమే రూ.12,911 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం జగన్ దాదాపు 45 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు.
ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం జగన్ అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. మొదట ఢిల్లీలోని జనపథ్–1 నివాసానికి చేరుకున్న సీఎం జగన్ ఆ తర్వాత హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం అయ్యారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలవనున్నారు.