పిల్ల‌ల‌పై కోవాగ్జిన్ టీకా ట్రయల్స్ ప్రారంభం..

Clinical trial of Covaxin on children begins at AIIMS, Patna. భారత్ బయోటెక్ త‌యారుచేసిన‌ కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ పిల్లలపై ట్రయల్స్‌ ప్రక్రియను

By Medi Samrat  Published on  3 Jun 2021 5:54 AM GMT
పిల్ల‌ల‌పై కోవాగ్జిన్ టీకా ట్రయల్స్ ప్రారంభం..

భారత్ బయోటెక్ త‌యారుచేసిన‌ కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ పిల్లలపై ట్రయల్స్‌ ప్రక్రియను ప్రారంభించింది. పాట్నాలోని ఎయిమ్స్ కేంద్రంగా పిల్లలపై టీకా ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. అయితే.. 15 మంది పిల్లలను వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ కోసం ఎంపిక చేయగా.. అన్ని పరీక్షల అనంతరం ముగ్గురికి వ్యాక్సిన్‌ వేశారు. పాట్నా ఎయిమ్స్ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సీఎం సింగ్ మాట్లాడుతూ.. సుమారు వంద మందిపై ట్రయల్స్‌ నిర్వహించాల్సి లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. 108 మంది టీకాలు వేయించుకోవటానికి పేర్లు నమోదు చేసుకున్నారని అన్నారు.

ట్రయల్స్‌లో బాగంగా పిల్ల‌ల‌కు ఇంట్రామాస్కులర్‌ విధానంలో 0.5 ఎం.ఎల్‌ మోతాదు ఇచ్చామని.. అనంతరం వారిని రెండు గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచామని తెలిపారు. ఇదిలావుంటే.. రెండు నుంచి 18 సంవత్సరాల వయసున్న పిల్లల్లో రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపింది. పిల్లలపై ట్రయల్స్‌ పాట్నా, ఢిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు నాగ్‌పూర్‌లోని మెడిట్రినా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో జరుగుతున్నాయి.


Next Story