ఢిల్లీ లోని నిర్మాణ్ విహార్ మెట్రో స్టేషన్ వెలుపల అమర్చిన ఐరన్ గ్రిల్‌లో ఇరుక్కుపోయిన పదేళ్ల బాలికను సీఐఎస్ఎఫ్ జవాన్ రక్షించారు. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో స్టేషన్‌లోని గేట్ నంబర్ 1 మెట్లపై ఏర్పాటు చేసిన 20 అడుగుల ఎత్తులో ఉన్న గ్రిల్ పైకి బాలిక ఎక్కుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. "కానిస్టేబుల్ NK నాయక్ తెలివిగా వ్యవహరించి, గ్రిల్‌లో చిక్కుకున్న బాలికను రక్షించాడు" అని సీనియర్ CISF అధికారి తెలిపారు.
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని 130కి పైగా ఢిల్లీ మెట్రో స్టేషన్‌లలో ప్రతిరోజు ఆరు-ఏడు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్‌ఎఫ్) తీవ్రవాద నిరోధక రక్షణ కోసం మెట్రో స్టేషన్స్ లో జవాన్ లను మోహరించింది. రెస్క్యూ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది. జవాన్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.