దూకుడు పెంచిన అజిత్ దోవల్

CIA Chief Met Ajit Doval In New Delhi Amid Taliban Government Formation. ఆఫ్ఘ‌నిస్థాన్‌లో చోటు చేసుకుంటోన్న ప‌రిణామాలు, తాలిబన్ల తీరుపై జాతీయ

By Medi Samrat  Published on  8 Sep 2021 9:46 AM GMT
దూకుడు పెంచిన అజిత్ దోవల్

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో చోటు చేసుకుంటోన్న ప‌రిణామాలు, తాలిబన్ల తీరుపై జాతీయ భ‌ద్రతా స‌ల‌హాదారు అజిత్ దోవల్ వ‌రుసగా ప‌లు దేశాల అధికారుల‌తో స‌మావేశ‌మ‌వుతున్నారు. ఢిల్లీలో భార‌త్, ర‌ష్యా జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుల‌ బృందం స‌మావేశ‌మైంది. ర‌ష్యా ఎన్ఎస్ఏ నికోలాయ్ పాత్రుషెవ్‌తో అజిత్ దోవ‌ల్ బృందం చర్చించింది. అమెరికాకు చెందిన సీఐఏ అధికారులతో అజిత్ దోవ‌ల్ స‌మావేశ‌మై ఆఫ్ఘ‌న్‌లో తాజా ప‌రిణామాలపై చ‌ర్చ‌లు జ‌రిపారు. ఆఫ్ఘ‌న్‌లో తాలిబన్లు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో, అక్కడ చోటు చేసుకుంటోన్న ప‌రిణామాలు, భ‌విష్య‌త్తులో పొంచి ఉన్న ముప్పు వంటి అంశాల‌పై భారత్ అప్ర‌మ‌త్త‌మైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో మరోసారి స‌మావేశ‌మై చ‌ర్చించారు. ఈ స‌మావేశంలోనూ అజిత్ దోవ‌ల్ పాల్గొన్నారు. ఆఫ్ఘ‌న్‌లో ప‌రిస్థితుల‌పై భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది.

అమెరికా సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్ విలియం బ‌ర్న్స్‌తో జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ మంగ‌ళ‌వారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ప‌రిస్థితుల‌పై వీళ్లిద్ద‌రూ చ‌ర్చించారు. తాలిబన్లు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజే ఈ ఇద్ద‌రూ భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. అమెరికా ఉగ్ర‌వాదిగా గుర్తించిన వ్య‌క్తినే తాలిబాన్లు ప్ర‌ధానిగా ప్ర‌క‌టించారు. ధోవ‌ల్‌, బ‌ర్న్స్ ఏం చ‌ర్చించార‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త లేదు. ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో ఉన్న వ్యక్తిని ప్రధానిగా పేర్కొనడంతోపాటు, ఆఫ్ఘనిస్తాన్‌ను నడిపే వ్యక్తుల పేర్లను తాలిబాన్లు ప్రకటించిన రోజున ఈ సమావేశం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో, భద్రతా సమస్యల గురించి చర్చించారని తెలుస్తోంది.

అజిత్ దోవ‌ల్‌ ర‌ష్యా భ‌ద్ర‌తాధికారి నికోలోయ్ పాత్రోసేవ్ తో ఢిల్లీలో స‌మావేశం జ‌రిగింది. రెండు దేశాల‌కు చెందిన ఉన్న‌త స్థాయి అధికారులు కూడా భేటీ అయ్యారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఎన్ఎస్ఏ అధికారులు చ‌ర్చించారు. చైనా, పాకిస్థాన్ అంశాల‌పైన కూడా రెండు దేశాల అధికారులు చ‌ర్చించ‌నున్నారు. ర‌ష్యా భ‌ద్ర‌తా మండ‌లిలో కార్య‌ద‌ర్శిగా ఉన్న‌ పాత్రోసేవ్ మంగ‌ళ‌వారం సాయంత్రం ఇండియాకు వ‌చ్చారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న ప్ర‌ధాని మోదీని కూడా క‌ల‌వ‌నున్నారు. ర‌ష్యాకు చెందిన ఎన్ఎస్ఏ.. పుతిన్‌కు నమ్మ‌కంగా ఉంటుంది. ఇండియ‌న్ చీఫ్ దోవ‌ల్‌తోనూ ర‌ష్యాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి ఉత్ప‌న్న‌మ‌య్యే ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కొనేందుకు భార‌త్‌తో ర‌ష్యా క‌లిసి ప‌నిచేయ‌నున్న‌ది.


Next Story
Share it